Mad Square Movie :2023లో విడుదలైన 'మ్యాడ్' సినిమా కూడా ఇదే కోవకు చెందిందే. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం హిలేరియస్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ మీద మేకర్స్ ఫోకస్ పెట్టారు. అప్పట్లోనే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందంటూ అనౌన్స్ కూడా చేశారు.
తాజాగా ఆ అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ అఫీషియల్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'మ్యాడ్ స్క్వేర్' గురించి అనౌన్స్ చేసింది. ఉగాది రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డ ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక నార్నే నితిన్ నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'మ్యాడ్'. ఇందులో నితిన్‌తో పాటు సంతోష్ శోభన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. హీరోతో పాటు ఇందులోని నటీనటులందరూ తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌తో మరింత ఎంటర్టైన్ చేసేందుకు ముందుకు రానున్నారు.