Longest Movie Run In Theatres Tollywood :ప్రస్తుతం థియేటర్లలో ఏ సినిమా రిలీజైన వారం రోజులు లేదంటే గట్టిగా పది రోజులు ఆడుతుంది. కోట్లు వసూలు చేసి వెళ్లిపోతుంది. అదే ఫ్లాప్ అయితే రెండు మూడు రోజులు కూడా ఆడటం కష్టమే. అయితే ఒకప్పుడు సినిమాలు ఏకంగా వంద రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఆడేవి. వంద రోజులు, రెండు వందల రోజుల వేడుకలు కూడా ఘనంగా జరిపేవారు. ఏ సినిమా ఎక్కువ రోజులు ఆడితే ఆ హీరో గెలిచినట్టే! ఇంకా చెప్పాలంటే వెయ్యి రోజులు కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి. మరి తెలుగులో లాంగ్ రన్ టైమ్ థియేటర్లలో ఆడిన టాప్ సినిమాలు ఏంటో ఓ సారి లుక్కేద్దాం.
లెజెండ్ 1000 రోజులకుపైనే - .నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా కర్నూలోని ఓ థియేటర్లో ఏకంగా 1000 రోజులకుపైగా ఆడింది. 2014లో బోయపాటి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌నే మార్చేసింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించింది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించి తన నట విశ్వరూపంతో థియేటర్‌ను షేక్ చేసేశారు. ఈ చిత్రం 1000వ రోజు పోస్టర్‌ను కూడా ప్రత్యేకంగా విడుదల చేశారు మేకర్స్.
మగధీర - మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ను స్టార్ హీరో చేసిన సినిమా ఇది. 2009లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని కర్నూలులోని ఓ థియేటర్లో 1000 రోజులు ఆడి అదరగొట్టింది. ఈ చిత్రంలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించగా శ్రీహరి షేర్ ఖాన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.
పోకిరి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్లో టాప్ మూవీ అనగానే టక్కున చాలా మందికి గుర్తొచ్చేది పోకిరినే. మహేశ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. 2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓ థియేటర్లో 580 రోజుల పాటు ప్రదర్శన అయింది. ఇలియానా హీరోయిన్గా నటించగా ప్రకాశ్ రాజ్, నాజర్, సాయాజీ షిండే ఇతర కీలక పాత్రల్లో నటించారు.
మంగమ్మగారి మనవడు - నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం కూడా భారీ హిట్‌ను అందుకుంది. కోడి రామకృష్ణ దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని తారకరామ థియేటర్లలో ఏకంగా 565 రోజులు ఆడిందట.