Rajinikanth KS Ravikumar : సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ ఆరోపణలు చేశారు. తమ కాంబోలో వచ్చిన లింగ ఫ్లాప్ ఎందుకు అయిందో వివరించారు. ఆ సినిమా ఎడిటింగ్‌లో రజనీ కాంత్ జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి కుమార్ ఈ ఆరోపణలు చేస్తూ, సినిమా పరాజయం గురించి చెప్పుకొచ్చారు.
"లింగ్ ఎడిటింగ్ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ జోక్యం చేసుకున్నారు. సీజేఐ (కంప్యూటర్ గ్రాఫిక్స్) చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్‌గా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు" అని రవి కుమార్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, దర్శకుడు కె.ఎస్.రవి కుమార్‌కు కోలీవుడ్‌లో మంచి దర్శకుడిగా గుర్తింపు ఉంది. రజనీ కాంత్‌తో కలిసి ఆయన గతంలో ముత్తు, నరసింహ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి భారీ విజయాన్ని సాధించారు. అనంతరం వీరి కాంబినేషన్లో 2014లో లింగ సినిమా వచ్చింది. భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో రజనీ కాంత్ ద్విపాత్రాభినయంలో కనిపించి మెప్పించారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు.
భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. మంచి వసూళ్లనే అందుకున్నప్పటికీ డిజాస్టర్ టాక్‌ను అందుకుంది. ఈ మూవీ రిజల్ట్ గురించి 2016లో రవి కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ - వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. అది అంత ఈజీ కాదు. కలెక్షన్ల పరంగా మా చిత్రం సూపర్ హిట్" అని చెప్పుకొచ్చారు.