Lavanya Tripathi Mother Role : హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి తెలిసిందే. 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆడియెన్స్‌ను అలరించింది. హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె ఈ మధ్యే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుని ఆ కుటుంబంలోకి అడుగు పెట్టింది. 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో కలిసి నటించిన సమయంలో ఈ జంట ప్రేమలో పడింది.
అయితే తాజాగా లావణ్య త్రిపాఠికి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అదేంటంటే ఆమె తల్లి కాబోతుందట! అయితే ఇది నిజ జీవితంలో కాదండోయ్. రీల్ లైఫ్‌లో అట. ఇప్పటికే హీరోయిన్గా ఆమెకు అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే ఆమె నటించిన 'మిస్ పర్ఫెక్ట్' సిరీస్ ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఆధారంగా ఇది తెరకెక్కనుందట.
ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి ఓ స్టార్ హీరో చిన్నప్పటి రోల్‌కు తల్లిగా కనిపించనుందని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. అందుకే లావణ్య త్రిపాఠి ఈ సినిమాను ఒప్పుకుందట. ప్రస్తుతం ఈ వార్తే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ విషయం తెలుసుకుంటున్న మెగా అభిమానులు లావణ్య నిజ జీవితంలో ఆ గుడ్ న్యూస్ చెబితే బాగుండు అని ఆశిస్తున్నారు. అలానే సినిమాలో హీరోకు తల్లి పాత్ర అంటే తర్వాత కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతోందని కూడా కాస్త ఫీలవుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?