తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వరుణ్​ తేజ్​కు ఆ సమస్య ఉంది! : లావణ్య త్రిపాఠి - Lavanya Tripathi Miss Perfect

Lavanya Tripathi Comments On Varun Tej : వివాహం తర్వాత మొదటిసారి 'మిస్​ పర్ఫెక్ట్'​ అనే రొమాంటిక్​ వెబ్​సిరీస్​తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు మెగా కొత్త కోడలు లావణ్య. ఈ నేపథ్యంలో వెబ్​సిరీస్​ ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె భర్త వరుణ్​ తేజ్ గురించి​ ఇంట్రెస్టింగ్​ కామెంట్​ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

Lavanya Tripathi Comments On Varun Tej
Lavanya Tripathi Comments On Varun Tej

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 4:28 PM IST

Lavanya Tripathi Comments On Varun Tej :వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి పెయిర్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్​లో మోస్ట్​ క్యూట్​ అండ్​ లవెబుల్​ కపుల్​గా ఈ జంటకు పేరుంది. 5 ఏళ్లపాటు సీక్రెట్​గా లవ్​ట్రాక్​ నడిపించిన వీరిద్దరూ గతేడాది నవంబర్​లో మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. ఇటలీలో వీరి పెళ్లి ఎంతో గ్రాండ్​గా జరిగింది.

Lavanya Tripathi Web Series : వివాహం తర్వాత లావణ్య నటించిన తొలి వెబ్​సిరీస్​- 'మిస్​ పర్ఫెక్ట్'​. లావణ్య లీడ్​ రోల్​లో నటించిన మిస్​ పర్​ఫెక్ట్​లో హీరోగా అభిజిత్​ నటించారు. మంచి స్టోరీలైన్​తో రొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ వెబ్​సిరీస్​ ఫిబ్రవరి 2న డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ వేదికగా స్ట్రీమింగ్​ కానుంది. అయితే రిలీజ్​కు కొద్దిరోజులే సమయం ఉండటం వల్ల ప్రమోషన్స్​లో బిజీగా గడుపుతున్నారు మెగా కోడలు. ఇందులో భాగంగానే తన సహనటులతో కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తనకు కొన్ని ప్రశ్నలు అడిగారు యాంకర్​. ఈ క్రమంలోనే తన భర్త వరుణ్​ తేజ్​కు ఉన్న ఓ హెల్త్​ ప్రాబ్లమ్​ గురించి ఆసక్తికరమైన కామెంట్స్​​ చేశారు.

రియల్​ లైఫ్​​లో మిస్​ పర్ఫెక్షనిస్ట్​గా ఉంటారా?
ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్​ మీరు వెబ్​సిరీస్​లో చాలా పర్ఫెక్షనిస్ట్​గా కనపించనున్నారు కదా, మరి 'రియల్​ లైఫ్​​లో కూడా మీరు ఇలానే మిస్​ పర్ఫెక్షనిస్ట్​గా ఉంటారా?' అని లావణ్యను అడగ్గా, ఇందుకు ఆమె సమాధానం ఇచ్చారు. కొన్ని విషయాల్లో మాత్రమే తాను పర్​ఫెక్షనిస్ట్​గా ఉంటానని చెప్పారు. 'అన్ని విషయాల్లో అలా ఉంటే అది నాకు సమస్యగా మారుతుంది. ప్రస్తుతానికి నాకు అలాంటి సమస్యలేమీ లేవు' అని క్లారిటీ ఇచ్చారు లావణ్య.

యాంకర్​ : మీరు, వరుణ్​ తేజ్​లో ఎవరు ఎక్కువ పర్ఫెక్షనిస్ట్​?
లావణ్య : నవ్వుతూ.. నాతో పోలిస్తే వరుణ్​ తేజ్​ చాలా విషయాల్లో పర్​ఫెక్ట్​గా ఉండాలని అనుకుంటాడు. వీటిని నేను అంతగా పట్టించుకోను. తేజ్​ను చూస్తుంటే అప్పుడప్పుడు అతడికి ఓసీడీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదీ ఏమైనా అన్నీ అర్థం చేసుకుని సపోర్ట్​ చేసే భర్త ఉంటే ఎలాంటి సమస్య ఉండదు.

భర్త​పై లావణ్య చేసిన ఈ కామెంట్​తో నిజంగానే వరుణ్​ తేజ్​కు ఓసీడీ సమస్య ఉందా అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని డైరెక్ట్​గా చెప్పలేకే లావణ్య ఇలా చెప్పి ఉంటారని కొందరు అంటున్నారు.

"ప్రస్తుతం నా జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. మెగా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్​గా నిలుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లికి ముందు నా కెరీర్​ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. పెద్దగా మార్పులైతే ఏమీ కనిపించట్లేదు."
- లావణ్య త్రిపాఠి

'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్​ డేట్​ - మేకర్స్ కీలక ప్రకటన!

పాటకు రూ. 50లక్షలు! - అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కొరియోగ్రాఫర్ ఎవరంటే ?

ABOUT THE AUTHOR

...view details