Lal Salaam Telugu Trailer:కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలామ్ తెలుగు ట్రైలర్ రిలీజైంది. మంగళవారం తమిళ ట్రైలర్ రిలీజ్కాగా బుధవారం (ఫిబ్రవరి 07)న మేకర్స్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. అయితే కొన్నేళ్లుగా రజనీకాంత్‌కు తెలుగులో సింగర్ మనో డబ్బింగ్ చెప్పేవారు. కానీ, ఈ సినిమాలో ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఛేంజ్ అయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరో సాయికుమార్ లాల్ సలామ్‌లో రజనీకి డబ్బింగ్ చెప్పారు. దీంతో సూపర్‌స్టార్ వాయిస్‌లో ఏదో మిస్సైంది అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ సినిమా ట్రైలర్ మీరు చూశారా?
పల్లెటూరి నేపథ్యంతో ట్రైలర్ ప్రారంభమౌతుంది. ఊర్లో వర్గాల మధ్య గొడవలు, రాజకీయాల అంశాలు ముఖ్యమైనవిగా చూపించారు. 'బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం. బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం' అంటూ రజనీ డైలాగ్స్ ట్రైలర్లో హైలైట్‌గా ఉంది. ఇక టీమ్ఇండియా దిగ్గజం కపిల్ దేవ్‌ను కూడా ట్రైలర్లో చూపించారు. ఊర్లో జరిగే అల్లర్లకు క్రికెట్ మ్యాచ్ పరిష్కారమా? మొయిదీన్ భాయ్ (రజనీకాంత్) పాత్ర ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే.
Lal Salaam Cast: సినిమాలో రజనీకాంత్‌తోపాటు విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్,ధన్యా బాలకృష్ణన్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కపిల్ దేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ సతీమణి జీవిత కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. ఆమె దాదాపు 33 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ ఈ సినిమాను తమిళ్ సహా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు.