తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆగని 'దేవర' రికార్డులు జోరు - ఓవర్సీస్​లో మరో ఘనత - NTR Devara Pre Sales Record - NTR DEVARA PRE SALES RECORD

NTR Devara Pre Sales Record : ఇప్పటికే పలు రికార్డులు అందుకున్న ఎన్టీఆర్ 'దేవర' తాజాగా మరో ఘనతను అందుకుంది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
NTR Devara Pre Sales Record (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 8:48 AM IST

Updated : Sep 24, 2024, 10:01 AM IST

NTR Devara Pre Sales Record : కొరటాల శివ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం 'దేవర'. ఆచార్య లాంటి డిజాస్టర్​​ తర్వాత ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలనే కసి, పట్టుదలతో రూపొందించారు కొరటాల. ఆర్​ఆర్​ఆర్​తో భారీ బ్లాక్ బస్టర్ హిట్​ అందుకున్న యంగ్ టైగర్​ ఎన్టీఆర్​తో కలిసి ఈ సినిమా చేశారు. పైగా అప్పటికే వీరిద్దరి కాంబోలో జనతా గ్యారేజ్​ లాంటి పెద్ద హిట్ రావడంతో ఈ దేవరపై మొదటి నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రీసెంట్​గా విడుదలైన ప్రచార చిత్రాలతో ఆ అంచనాలు మరింత రెట్టంపు అయ్యాయి.

ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండియర్​గా రిలీజ్ కానుంది. దీంతో విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్​లో జోరు పెరిగింది. ఓవర్సీస్​లో ప్రీ సేల్స్​ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే విడుదలైన పాటలు, ట్రైలర్​తో పాటు ఈ ప్రీ సేల్స్​ రికార్డులు అందుకోవడం మొదలుపెట్టాయి.

అలా తాజాగా ఈ దేవర ఖాతాలోకి మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకున్న ఈ చిత్రం, తాజాగా రెండు మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది. ఇకపోతే దేవర విడుదలకు మరో మూడు రోజులు ఉండడం వల్ల ఈ ప్రీ సేల్స్​ బుకింగ్స్​ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు అంటున్నాయి.

Devara Movie Promotions :ఈ ఈసినిమా ప్రమోషన్స్‌ కోసం ఎన్టీఆర్‌ తాజాగా అమెరికా కూడా వెళ్లారు. లాస్‌ ఏంజెలిస్‌లో జరగనున్న బియాండ్‌ ఫెస్ట్‌లో తారక్​ పాల్గొనున్నారు. ఆ ఈవెంట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా దేవర నిలిచిన విషయం తెలిసిందే. చిత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న అమెరికాలోని ప్రఖ్యాత ఈజిప్షియన్‌ థియేటర్‌లో ప్రీమియర్‌గా ఈ దేవరను ప్రదర్శించనున్నారు. అందుకే తారక్​ ఇప్పటికే లాస్‌ ఏంజెలిస్‌ చేరుకున్నారు.

'దేవర' బుకింగ్స్ షురూ - తారక్ ఫ్యాన్స్ హర్రీ అప్

నార్త్​ అమెరికాలో 'దేవర' విధ్వంసం! - వారంలోనే ఆ హిట్ మూవీ రికార్డును బ్రేక్​ చేసేందుకు రెడీ! - Jr NTR Devara Movie

Last Updated : Sep 24, 2024, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details