Kirrak Seetha Elimination and Remuneration:బిగ్‌బాస్ సీజన్ 8లో ఆరో వారం మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా కిర్రాక్ సీత ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఇక దసరా సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ఎపిసోడ్ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగింది. అయితే కిర్రాక్ సీత రెమ్యూనరేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం..
ఆరో వారం నామినేషన్స్‌లో గంగవ్వ, కిర్రాక్ సీత, పృథ్వీ, మెహబూబ్, విష్ణుప్రియ, యష్మీలు ఉండగా.. శనివారం ఎపిసోడ్లో పృథ్వీని సేవ్ చేశారు నాగార్జున. ఇక ఆదివారం నాడు విష్ణుప్రియ, గంగవ్వ, యష్మీలు సేవ్కాగా.. చివరకు మెహబూబ్, సీత మిగిలారు. వీరిద్దరిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన సీత ఎలిమినేట్ అయింది. ఈ సందర్భంగా స్టేజీ మీదకు వచ్చిన సీత.."ఎలిమినేట్ అవుతానని అస్సలు అనుకోలేదు. నా ఆట ఎక్కడో ప్రేక్షకులకు నచ్చకపోయి ఉండవచ్చు. ఎన్నెన్నో కష్టాలు చూశాను. ఇది పెద్ద విషయమేమీ కాదు’"అని చెప్పుకొచ్చింది. ఇక హౌజ్‌లో ఉన్న వాళ్లలో ఎవరికి వైట్ హార్ట్, బ్లాక్ హార్ట్ ఇస్తావని నాగార్జున అడగ్గా తన అభిప్రాయాన్ని చెప్పింది సీత.
వైట్ హార్ట్
విష్ణుప్రియ:చాలా అమాయకురాలు. గేమ్ షో గురించి పెద్దగా అర్థం కాదు. కానీ, ఆమెలో ఫైర్ ఉంది అని సీత చెప్పింది." నువ్వు బయటకు వెళ్లాక మీ అమ్మను మర్చిపోయేంత ప్రేమ దొరకాలి. నువ్వు పెళ్లి చేసుకునే పార్ట్‌నర్ కోసం ప్రార్థిస్తా. నిన్ను బాగా చూసుకుంటాడు. కృష్ణుడు నాతో పలికిస్తున్న మాటలివి. నిన్ను ఫైనల్స్‌లో చూడాలనుకుంటున్నా" అంటూ సీత చెబుతూ ఎమోషనల్ అయ్యింది.
నబీల్: "నా తమ్ముడు నబీల్ చాలా బాగా ఆడతాడు. రియాల్టీ షోలో రియల్ పీపుల్ విన్ అవ్వాలని అనుకుంటున్నా" అని చెప్పింది.
అవినాష్:"తను వచ్చాక పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చాడు. వచ్చి వన్ వీకే అయినా, తను మాట్లాడుతుంటే నవ్వుతూనే ఉన్నాను. నాలో ఆ జోష్ తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ" అంటూ చెప్పింది.
మరో షాకిచ్చిన నాగ మణికంఠ - భార్య కంటే ఎన్నేళ్లు చిన్నోడో తెలుసా?