Kiran Abbavaram Rahasya Gorak Marriage :గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం - రహస్య గోరక్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కర్ణాటక కూర్గ్‌లోని ఓ ప్రైవేటు రిసార్ట్‌లో ఈ వివాహ వేడుక జరిగినట్లు సమాచారం.
తెలుగు సంప్రదాయంలో కిరణ్ అబ్బవరం - రహస్య గోరక్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించి కన్యాదానం, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం తంతు వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా, ఇప్పుడు రహస్య మెడలో కిరణ్ మూడుముళ్లు వేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. అలా ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో సినీ ప్రియులు నూతన వధూవరులకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇద్దరు కలకాలం పిల్లాపాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు.
కాగా, 'రాజావారు రాణిగారు (2019) చిత్రంతో కిరణ్ అబ్బవరం అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రహస్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. అయితే తమపై వచ్చిన రిలేషన్షిప్ రూమర్స్‌ను ఈ జంట ఎప్పుడు స్పందించలేదు. కానీ కొన్ని రోజుల క్రితం ఈ జంట పెళ్లి కబురు వినిపించి అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేశారు. అలా దాదాపు ఐదేళ్ల పాటు రహస్య ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు.