తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కిరణ్‌ వెడ్స్ రహస్య- పెళ్లెప్పుడో చెప్పిన హీరో- వేదిక అదేనా? - Kiran Abbavaram Weds Rahasya Gorak - KIRAN ABBAVARAM WEDS RAHASYA GORAK

Kiran Abbavaram Marriage : టాలీవుడ్ స్టార్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన ప్రేయసి నటి రహస్య గోరక్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇంతకీ వీళ్ల పెళ్లి ఎప్పుడంటే?

KIRAN ABBAVARAM WEDS RAHASYA GORAK
KIRAN ABBAVARAM (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 3:43 PM IST

Updated : Aug 20, 2024, 3:52 PM IST

Kiran Abbavaram Marriage : 'రాజావారు రాణీగారు', ' SR కల్యాణ మండపం' లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో పాపులరైన యాక్టర్ కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రేయసి, నటి రహస్య గోరక్‌తో ఏడడుగులు వేయనున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

కర్ణాటకలో కూర్గ్‌లో ఆగస్టు 22న వీళ్ల పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ రహస్య సన్నిహితులు, బంధువులంతా ఆ ఊరిలోనే ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఈ జంట హైదరాబాద్‌లో సినీ ప్రముఖులకు, సన్నిహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఇప్పటికే పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమైనట్లు కిరణ్ షేర్ చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది.

షార్ట్స్‌ ఫిల్మ్స్‌ ద్వారా ఎంట్రీ

షార్ట్ ఫిల్మ్స్‌ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు కిరణ్​. 2019లో వచ్చిన 'రాజా వారు రాణిగారు' సినిమాతో హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా మంచి సక్సెస్‌ సాధించింది. ఆ తర్వాత 'ఎస్సార్ కళ్యాణమండపం' అనే సినిమా ద్వారా మంచి పేరు సంపాదించారు. అయితే 'సమ్మతమే', 'వినరో భాగ్యము విష్ణుకథ', 'మీటర్', 'రూల్స్ రంజన్' చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, తన నటనతో కిరణ్‌ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రసుత్తం 'క' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌తో పాటు అటు పెళ్లి పనుల్లోనూ బిజీగా ఉన్నారు. మరోవైపు రహస్య గోరక్ కూడా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.

లవ్ స్టోరీ మొదలైంది అక్కడే
ఇక ఈ జంట 'రాజావారు రాణిగారు' సినిమా సమయంలో కలిశారు. ఈ సినిమా షూటింగప్పుడే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అది కాస్త క్రమంగా ప్రేమగా మారింది. అయితే గతంలో వీరిద్దరూ లవ్​లో ఉన్నరంటూ పలుమార్లు సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వైరలయ్యాయి. కానీ వీటిపైన స్పందించిన కిరణ్ అలాంటిదేమీ లేదని, రహస్యతో ఉన్నది స్నేహం మాత్రమేనంటూ ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. కానీ, వారిద్దరూ లవర్స్ అంటూ రీసెంట్​గా కిరణ్​ ట్విస్ట్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేశారు.

కిరణ్ అబ్బవరం 'క' టీజర్ రిలీజ్- ఈ హీరో పక్కవాళ్ల ఉత్తరాలు చదువుతాడు! - KA Teaser

'సాలరీ తక్కువని అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది'.. సంపాదనలో పోలికపై కిరణ్​ సూపర్​ లాజిక్​..

Last Updated : Aug 20, 2024, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details