తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గేమ్ ఛేంజర్'​ ప్రమోషన్స్​కు కియారా దూరం! - ఆమెకు ఏమైందంటే? - KIARA ADVANI GAME CHANGER

గేమ్ ఛేంజర్​ ప్రమోషన్స్​కు కియారా దూరం! - ఇంతకీ ఆమెకు ఏమైందంటే?

Kiara Advani Game Changer Promotions
Kiara Advani (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2025, 7:12 AM IST

Kiara Advani Game Changer Promotions : గ్లోబల్​ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్​లో రూపొందిన గేమ్ ఛేంజర్ మరికొద్ది రోజుల్లో థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. జనవరి 10న వరల్డ్​వైడ్​గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్​లోని రాజమండ్రిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్​ కూడా అట్టహాసంగా జరిగింది. అయితే దీనికి హీరోయిన్ కియారా అద్వానీ హాజరు కాలేదు.

అంతకుముందు నుంచి కూడా కొన్ని ఈవెంట్స్​కు ఆమె రావట్లేదు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఆమెకు ఏమైందంటూ నెట్టింట ఆరా తీశారు. అయితే వర్క్ ప్రెజర్ వల్ల కియారా అలిసిపోయిందని, డాక్టర్లు ఆమెను రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె ఈవెంట్స్​కు దూరంగా ఉన్నారట.

ఇక సినిమా విషయానికొస్తే, రీసెంట్​గా రిలీజైన ట్రైలర్​కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అటు పాటలు కూడా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటించింది. నటి అంజలీ, సీనియర్ నటుడు యస్​ జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్​ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు భారీ బడ్జెట్​తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు.

సినిమాలో హైలైట్స్ ఇవే!
ఒక ఐఎయస్ ఆఫీసర్- రాజకీయ నాయకుడి మధ్య గొడవే ఈ సినిమా కాన్సెప్ట్​గా అర్థమవుతోంది. హీరో చరణ్ కాలేజీ స్టూడెంట్, కలెక్టర్, పోలీస్, రాజకీయ నాయకుడుగా పలు గెటప్స్​లో కనిపించారు. అక్కడక్కడా రామ్​చరణ్ మేనరిజం ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో సునీల్, బ్రహ్మనందం, వెన్నెల కిషోర్ విజువల్స్​ కూడా నెక్ట్స్ లెవెల్​లో ఉన్నాయి. యస్ జే సూర్య- హీరో మధ్య జరిగే పొలిటికల్ వార్ సినిమాలో​ హీట్​ పెంచేలా ఉంది. ఒక కలెక్టర్ హోదాలో ఏకంగా ముఖ్యమంత్రిన 'రా' అని సంభోదించిన సీన్​ ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా ఉంది. ఇక రామ్​చరణ్​ చివరగా లుంగీ గెటప్​లో హెలికాప్టర్​లోంచి కత్తి పట్టుకొని దిగుతూ ఊర మాస్​గా చూపించారు. ఈ సీన్​కు థియేటర్లు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది.

'కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలి'- గేమ్​ఛేంజర్ ఈవెంట్లో పవన్

పాటలకే రూ.75 కోట్లు- 'గేమ్ ఛేంజర్' సాంగ్స్​ ఒక్కోటి ఒక్కో లెవెల్​

ABOUT THE AUTHOR

...view details