Keerthy Suresh Love Story :కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తాజాగా తన చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో ఏడడుగులు వేశారు. గోవాలో సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి తన ప్రేమ, పెళ్లి గురించి విశేషాలను పంచుకున్నారు. 12వ తరగతి చదువుతున్న సమయంలోనే తాను ఆంటోనీతో ప్రేమలో పడినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వారిద్దరూ 15 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నట్లు తెలిపారు. ఇక తన ప్రేమ వివరాలు కీర్తి మాటల్లోనే.
2010లో ఫస్ట్ ప్రపోజల్
నెల రోజులు మేమిద్దరం సరదాగా గడిపాం. ఆ తర్వాత నేను మా ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారంట్‌కు వెళ్లాను. అక్కడికి ఆంటోనీ కూడా వచ్చారు. అయితే మా ఫ్యామిలీతో ఉన్నందున తనను కలవలేకపోయాను. కనుసైగ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాను. అయితే ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయమంటూ తనతో అన్నాను. ఇక 2010లో ఆంటోనీ నాకు మొదటిసారి ప్రపోజ్ చేశాడు. 2016 నుంచి మా బంధం బాగా బలపడింది. ఆంటోనీ నాకు ప్రామిస్ రింగ్‌ను గిఫ్ట్ చేశారు. మేము పెళ్లి చేసుకునేంతవరకూ నేను దాన్ని నేను అస్సలు తీయలేదు. నా సినిమాల్లో కూడా మీరు ఆ రింగ్‌ను చూడొచ్చు.
నాకంటే ఏడేళ్లు పెద్ద
నాకు నా పెళ్లి ఇప్పటికీ ఓ కలలానే ఉంది. నా హృదయమంతా భావోద్వేగంతో నిండిన క్షణాలు అవి. మా పెళ్లి కోసం మేమిద్దరం ఎప్పటినుంచో ఎన్నో కలలు కన్నాం. మేము 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచే ప్రేమించుకుంటున్నాం. ఆంటోనీ నాకంటే ఏడేళ్లు పెద్దవాడు. ఆరేళ్ల నుంచి ఖతార్‌లో వర్క్ చేస్తున్నారు. తను నా కెరీర్‌కు ఎంతో సపర్ట్ చేస్తారు. ఆంటోనీ నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.
సమంత, విజయ్‌లకు తెలుసు
అయితే పెళ్లి ఫిక్స్ అయ్యేంతవరకూ మా లవ్ మ్యాటర్‌ను ప్రైవేట్‌గానే ఉంచాలని అనుకున్నాం. కానీ నేను ఆంటోనీ ప్రేమించుకుంటున్నట్లు ఉన్నట్లు నా సన్నిహితులకు, అలాగే ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే తెలుసు. విజయ్, సమంత, అట్లీ, ప్రియా, ప్రియదర్శన్, ఐశ్వర్యలక్ష్మి ఇలా కొంతమందికి మాత్రమే మా లవ్ గురించి తెలుసు.