తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

క్రిస్టియన్‌ పద్ధతిలో అలా చేయలని చెప్పా - నాన్న నుంచి ఆ రియాక్షన్‌ ఊహించలేదు :కీర్తిసురేశ్‌ - KEERTHY SURESH MARRIAGE

కీర్తి సురేశ్​ పెళ్లి ముచ్చట్లు - క్రిస్టియన్‌ సంప్రదాయంలో పెళ్లి గురించి తన తండ్రి ఏమన్నారంటే?

Keerthy Suresh About Christian Marriage
Keerthy Suresh (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2025, 1:37 PM IST

Keerthy Suresh About Christian Marriage : హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్​. తన చిరకాల ప్రియుడు ఆంటోనీతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఆమె ప్రస్తుతం తన మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్​లో సినిమా గురించి అలాగే తన వివాహం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో క్రిస్టియన్‌ పద్ధతి గురించి మాట్లాడారు. ఆంటోనీ కుటుంబ ఆచారాలకు అనుగుణంగా ఆ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకున్న విషయంపై తన తండ్రి రియాక్షన్ గురించి చెప్పారు.

"క్రిస్టియన్‌ సంప్రదాయంలోనూ మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాక నేను మా నాన్నతో మాట్లాడాను. ఈ సంప్రదాయం ప్రకారం వధువును ఆమె తండ్రి పెళ్లి వేదిక పైకి తీసుకురావాలి. నా కోసం మీరు కూడా ఆవిధంగా చేస్తారా?’ అని నేను ఆయన్ను అడిగాను. దానికి ఆయన 'తప్పకుండా చేస్తాను. మనం రెండు సంప్రదాయాల్లో పెళ్లి వేడుకలు జరుపుతున్నాం. కాబట్టి నేను కూడా ఆ పద్ధతులను కచ్చితంగా పాటిస్తాను' అని బదులిచ్చారు. అయితే ఆ మాట నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను చెప్పిన దానికి ఆయన అంగీకరిస్తారని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఆయన నాకోసం అలా చేయడం ఎంతో ఆనందానిచ్చింది" అని కీర్తి సురేశ్‌ తెలిపారు.

తాజాగా 'బేబీజాన్‌' ప్రమోషన్స్​లో కీర్తి పసుపుతాడు (మంగళసూత్రం)తో కనిపించారు. ఈ విషయంపై కూడా ఆమె స్పందించారు. "సౌత్ ఇండియాలో ఒక సంప్రదాయం ఉంది. పెళ్లి సమయంలో వధువు మెడలో వరుడు పసుపుతాడు (మంగళసూత్రం) కడతారు. దాన్ని మేము ఎంతో పవిత్రంగా భావిస్తాం. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత ఓ మంచి ముహూర్తం చూసి మంగళ సూత్రాలను బంగారు చైన్‌లోకి మార్చుకుంటాం. జనవరి చివరి వరకూ మంచి రోజులు లేవు. అందుకే అప్పటివరకూ నేను ఎక్కడికి వెళ్లినా కూడా ఇలా పసుపుతాడుతోనే కనిపిస్తాను" అని కీర్తి తెలిపారు.

ఇదిలా ఉండగా, ఆంటోనీ తనకు 15 ఏళ్ల నుంచి తెలుసునని కీర్తి సురేశ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనకంటే ఆయన తనకంటే ఏడేళ్లు పెద్దవాడని తెలిపారు. అయితే తాము తమ రిలేషన్​షిప్​ను సీక్రెట్​గా రిలేషన్‌లో ఉన్నామని, తాము కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని అన్నారు. 2022లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని కీర్తి తెలిపారు.

మా లవ్ స్టోరీ గురించి విజయ్, సమంతకు తెలుసు : కీర్తి సురేశ్

కీర్తి సురేశ్ పెళ్లిలో ఆమె డ్రీమ్ ఐకాన్- స్పెషల్ పోస్ట్ చూశారా?

ABOUT THE AUTHOR

...view details