Kaun Banega Crorepati Allu Arjun : తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా నార్త్‌లో ఆయన పేరు మార్మోగిపోయింది. అయితే తాజాగా ప్రఖ్యాత షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో అల్లు అర్జున్‌కు సంబంధించి ఓ ప్రశ్న అడగడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా, ఇటీవలే ఇదే షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఓ ప్రశ్న వేయడం హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే.
ఏం ప్రశ్న అంటే? - బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ మధ్యే కల్కి 2898 ఏడీ, వేట్టాయన్ చిత్రాలలో నటించి ఆడియెన్స్‌ను మెప్పించారు. అయితే బిగ్ బీ కేవలం బిగ్ స్క్రీన్‌పై మాత్రమే కాకుండా స్మాల్ స్క్రీన్‌పై కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అత్యంత ప్రేక్షకాదరణ సొంత చేసుకున్న టెలివిజన్ షో కౌన్ బనేగా కరోడ్‌పతికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దీనిని తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కూడా హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం హిందీలో కౌన్ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్ నడుస్తోంది. దీనికి కూడా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను అల్లు అర్జున్ సంబంధించిన ప్రశ్నను అడిగారు. '2023లో నేషనల్ అవార్డు గెలుచుకున్న నటుడు ఎవరు' అని అమితాబ్ అడిగారు. దానికి కంటెస్టెంట్ సరైన సమాధానం అల్లు అర్జున్ అని చెప్పి రూ.20 వేలు గెలుచుకున్నారు. అంతకుముందు రీసెంట్గా జరిగిన ఎపిసోడ్‌లో '2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నటుడు ఎవరు?' అని ప్రశ్న వేశారు అమితాబ్.