తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మర్డర్​ కేసులో స్టార్ హీరో అరెస్ట్​ - Hero Darshan Arrest - HERO DARSHAN ARREST

Kannada Star Hero Darshan Arrest : కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్​ను ఓ మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది.

Source ETV Bharat
Kannada Star Hero Darshan Arrest (Source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 11:48 AM IST

Updated : Jun 11, 2024, 12:24 PM IST

Kannada Star Hero Darshan Arrest : కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్​ను ఓ మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం (జూన్ 11) ఉదయం మైసూరులోని ఓ ఫామ్ హౌజ్​లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దర్శన్ సహా మరో పది మందిని రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో పోలీసు అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం సంచలనం రేపుతోంది.

అసలేం జరిగిందంటే? - రెండు రోజుల క్రితం అనగా జూన్ 9న కర్ణాటకలోని సుమన్నహళ్లి బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం దొరికింది. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత డెడ్​ బాడీని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిగా గుర్తించారు అధికారులు. రేణుకా స్వామి ఓ ఫార్మాసీ కంపెనీలో పనిచేసేవారని తెలిపారు. అనంతరం దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానితులను అరెస్ట్ చేసి విచారించగా ఇందులో హీరో దర్శన్ ప్రమేయం కూడా ఉన్నట్లు వారు చెప్పారు. దీంతో పోలీసులు దర్శనను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా ఆర్​ఆర్​ నగర్​లోని అతడి ఇంటి దగ్గర భారీ బందోబస్త్​ను కూడా ఏర్పాటు చేశారు.

ఆ నటిపై అసభ్యకరమైన కామెంట్లు - కన్నడ నటి పవిత్ర గౌడతో దర్శన్‌కు రిలేషన్ ఉన్నట్లు గతంలో రూమర్స్​ భారీగా వచ్చాయి. దర్శనతో తనకు సంబంధం ఉన్నట్లు ఆమె వివాదాస్పద పోస్ట్ కూడా చేసింది. దీంతో పవిత్ర గౌడ - దర్శన్ భార్య విజయ లక్ష్మి మధ్య వివాదం కూడా నడిచింది. అనంతరం నటి పవిత్ర గౌడపై రేణుకా స్వామి కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని కించపరిచే పోస్ట్‌లు చేశారట. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినట్లు తెలిసింది. ఈ కారణంతోనే రేణుకా స్వామి హత్య జరిగినట్లు కన్నడ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కాగా, దర్శన్ ఈ మధ్యే కాటేరా చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. గతేడాది డిసెంబర్​లో సలార్​కు పోటీగా విడుదలై సంచలన విజయం సాధించింది. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది.

హాట్​కేక్​లా అమ్ముడుపోతున్న 'కల్కి' టికెట్స్​!

'ఏదో తేడాగా ఉందే' - దీపిక తెలుగు డబ్బింగ్​పై ట్రోల్స్​! - Prabhas Kalki 2898 AD Trailer

Last Updated : Jun 11, 2024, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details