Disha Patani Kanguva : కంగువా చిత్రంతో తాజాగా బాక్సాఫీస్ ముందుకొచ్చింది బాలీవుడ్ భామ దిశా పటానీ. హీరో సూర్యతో కలిసి తెరపై సందడి చేసింది. ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రంలో ఏంజెలీనా అనే పాత్రలో సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి మాట్లాడుతూ "నా తొలి తమిళ సినిమానే హీరో సూర్యతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. కంగువాలో నటించానంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు" అని చెబుతోంది. అయితే ఈ చిత్రం కోసం ఆమె ఎంత రెమ్యునరేషన్ అందుకుంది, ఇంకా ఈ ముద్దుగుమ్మ గురించి పలు విశేషాలను తెలుసుకుందాం.
- కంగువా మూవీ కోసం దిశా పటానీ 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
- దిశా పటానీ 1992లో ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో జన్మించింది. బీటెక్ రెండో సంవత్సరంలోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టింది.
- లోఫర్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎంఎస్ ధోనీ (బయోపిక్)తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
- ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలని దిశా కలలు కన్నది. కానీ పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ 2013 రన్నరప్‌గా నిలవడం వల్ల సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది.
- ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియానూ ఫాలోవర్స్ ఎక్కువే. ప్రస్తుతం ఆమెను 6 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఎప్పుడు హాట్ ఫొటోస్‌తో పాటు తరచూ తన వర్క్ అవుట్ వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.
- ఒకప్పుడు జిమ్నాస్టిక్స్ చేస్తున్న సమయంలో దిశ తల నేలకు తగలి బలంగా గాయమైందట. అప్పుడు ఆమె ఆరు నెలల పాటు జ్ఞాపకశక్తి కోల్పోయినట్లు కథనాలు ఉన్నాయి.
- మహిళలకు స్ఫూర్తినిచ్చే పాత్రలంటే దిశాకు బాగా ఇష్టమట. అమ్మాయిలు కూడా అబ్బాయిలంత బలమైన వారేనని దిశా చెబుతుంటుంది.
- తాను ఓ సినిమాకు ఓకే చేసేముందు బలమైన పాత్ర అయితేనే ఓకే చెబుతానంటోంది. కథ నచ్చకపోతే సినిమాను ఓకే చేయను అని చెప్పింది.
- దిశాకు డ్యాన్స్ అంటే మహా ఇష్టం. కొత్త స్టెప్స్ నేర్చుకోవడమంటే మరింత ఆసక్తి ఎక్కువ. ఎప్పుడూ కొత్త వాటిని ప్రయత్నిస్తూనే ఉంటుంది.
- దిశా బయట ఇంట్రోవర్ట్‌గా ఉంటుంది. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే కాస్త భయం. ఫ్యాషన్ షోల సమయంలో ఎక్కువ భయపడుతుందట.