తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కంగన 'ఎమర్జెన్సీ'కి సెన్సార్ క్లియర్- రిలీజ్ ఎప్పుడంటే? - KANGANA RANAUT EMERGENCY MOVIE

Kangana Ranaut Emergency Movie : బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్​లో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది.

Kangana Ranaut Emergency
Kangana Ranaut Emergency (Source: ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2024, 5:14 PM IST

Updated : Oct 17, 2024, 5:31 PM IST

Kangana Ranaut Emergency Movie :బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్​లో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని కంగన వెల్లడించారు. 'ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించిందని తెలుపడానికి సంతోషిస్తున్నాం. సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం. ఓపికతో మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు' అని కంగన తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు.

కంగన స్వీయ దర్శకత్వంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాలు, పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇందులో కొన్ని సన్నివేశాల పట్ల ఓ వర్గం వారు అభ్యంతరం తెలుపుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు సెన్సార్ కూడా ఆలస్యం అవుతూ వచ్చింది. పలు సన్నివేశాలను తొలగించడానికి మేకర్స్​ ఒప్పుకోవడం వల్ల తాజాగా సర్టిఫికెట్ జారీ అయ్యింది.

కాగా, ఇందులో కంగన ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగానూ వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్​కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్​కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇక రీసెంట్​గా సినిమా నుంచి మ్యూజిక్ ఆల్బమ్ రిలీజైంది. పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన ఉంది. ఇక ఈ చిత్రంలో జయప్రకాశ్​ నారాయణ్‌ పాత్రలో బాలీవుడ్​ స్టార్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. వారితోపాటు మిలింద్ సొమన్, భూమికా చావ్లా, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా రూపొందింది. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్‌ 6న విడుదల కావాల్సిఉండగా సెన్సార్‌ సర్టిఫికెట్‌ రాని కారణంగా వాయిదా పడింది.

కంగన 'ఎమర్జెన్సీ' మళ్లీ వాయిదా- అప్పటిదాకా సెన్సార్ హోల్డ్! - Kangana Ranaut Emergency

'ఎమర్జెన్సీ'కి సెన్సార్ క్లియర్- కానీ ఆ సీన్స్​కు నో పర్మిషన్! - Kangana Ranaut Emergency

Last Updated : Oct 17, 2024, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details