తెలంగాణ

telangana

1000 కత్తుల పదునుతో సేనాపతి - కమల్, కాజల్​ కత్తి యుద్ధం చూశారా? - Indian 3 trailer

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 3:09 PM IST

Updated : Jul 12, 2024, 3:30 PM IST

Indian 3 Trailer : ఇండియన్ 2 సినిమా నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి స్పందననే అందుకుంటోంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్​లో ఇండియన్ 3 ట్రైలర్‌ను చూపించారు. ఇండియన్ 2 మొత్తం సినిమా ఇచ్చిన ఫీలింగ్‌ కన్నా ఇండియన్ 3 ట్రైలర్ ప్రేక్షకుడికి కొత్త ఉత్సాహం, ఉత్తేజం కలిగించింది. మీరు ఆ వీడియో చూడాలంటే ఈ కింద స్టోరీలోకి వెళ్లి చూసేయండి.

source ETV Bharat
Indian 3 Trailer (source ETV Bharat)

Indian 3 Trailer : ఇండియన్ 2 సినిమా నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి స్పందననే(Indian 2 Trailer) అందుకుంటోంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్​లో ఇండియన్ 3 ట్రైలర్‌ను చూపించారు. ఇండియన్ 2 మొత్తం సినిమా ఇచ్చిన ఫీలింగ్‌ కన్నా ఇండియన్ 3 ట్రైలర్ ప్రేక్షకుడికి కొత్త ఉత్సాహం, ఉత్తేజం కలిగించింది.

ఇండియన్ 2 క్లైమాక్స్‌లో వీరశేఖరన్ సేనాపతి సీబీఐ, పోలీసుల ముట్టడి నుంచి తప్పించుకొని వెళ్లిపోతాడు. అయితే ఆయన తప్పించుకుని వెళ్లిన కాసేపటికి ఓ వీడియో లింక్‌ను సీబీఐ ఆఫీసర్‌కు(బాబీ సింహా), చిత్ర అరవిందన్‌కు(సిద్ధార్థ్​) వాట్సాప్‌లో పంపించి "నా కోసం ఐదు నిమిషాలు మీ సమయాన్ని వెచ్చించండి" అని చెబుతాడు.

"సమాజంలో ఇప్పుడు జరుగుతున్నది పోరాటం కాదు. అప్పుడు జరిగింది అసలు యుద్ధం. మీకు కార్గిల్ వార్ గురించి తెలిసే ఉంటది. భారత సరిహద్దును చైనా ఆక్రమించింది. యుద్ధాలు మీ ఇంటి వరకు ఎప్పుడు రావు. ఓ యుద్దం వచ్చిందంటే ఎందరి ప్రాణాలు పోతాయో, ఎంత మంది రక్తాన్ని చిందించాల్సి వస్తుందో మీకు తెలియదు. దాని వల్ల వచ్చే నొప్పి కూడా మీకు తెలీదు. అసలు ఓ యుద్ధం వల్ల ఎంతటి నష్టం వాటిల్లుతుందో తెలీదు" అంటూ సేనాపతి చెప్పుకొస్తాడు. బ్యాక్​గ్రౌండ్​లో యుద్ధ సమయంలో మహిళల మాన ప్రాణాలు, పిల్లల హత్యలు జరుగుతున్న సన్నివేశాలను చూపించారు. కాజల్​, కమల్​ మధ్య కత్తి యుద్ధం సీన్స్​ను చూపించారు.

అనంతరం "1806 నుంచి బ్రిటీష్ వారితో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో చిందించిన రక్తం వల్ల మీకు ఈ స్వాతంత్య్రం వచ్చింది." అంటూ సేనాపతి ట్రైలర్​తో ప్రజలకు బోధించే ప్రయత్నం చేశాడు. దీంతో పాటే వీరశేఖరన్​ చేసిన పోరాటం గురించి చెప్పాడు.

"వీరశేఖరన్. అతడిని చరిత్ర మరిచిపోయింది. అతడు వన్ మ్యాన్ ఆర్మీ. అతడు ఓ గొప్ప పోరాట వీరుడు, స్వాతంత్ర్య ఉద్యమ నేత చరిత్రను తిరగరాశారు." అని చెప్పుకొచ్చాడు.

బ్యాక్​గ్రౌండ్​లో 1000 కత్తలకు ఎంత పదను ఉంటుందో అలాంటి వాడు వీరశేఖరన్. అలాంటి పులి కథను వినాలి. అంటూ కథ చెప్పి వీరశేఖరన్ చైతన్య పరుస్తాడు. ఫైనల్​గా ఇండియన్ 3 2025 సంవత్సరంలో రిలీజ్ కానుంది అని తెలిపారు మేకర్స్.

భారతీయుడు- 2 రివ్యూ : సేనాపతి మరోసారి మెప్పించినట్టేనా? - Bharateeyudu 2 Review

'భారతీయుడు- 2' పబ్లిక్​ టాక్- క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్ అంట! - Bharateeyudu 2 Reivew

Last Updated : Jul 12, 2024, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details