Kalki 2898AD Bookings : ఇప్పుడు మూవీ లవర్స్ ఎవరి నోట విన్నా కల్కి పేరే వినిపిస్తోంది. అంతా కల్కి ఫీవరే కనిపిస్తోంది. మరో మూడు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే ఇప్పుడు సినిమా విషయంలో ప్రేక్షకులకు చిన్న షాక్ తగిలింది!
అదేంటంటే ? గతంలో కొంత మంది హీరోలు నటించిన హిట్ చిత్రాల పేర్లనే ఇప్పుడు తాజాగా కొన్ని చిత్రాలకు పెడుతున్నారు. వాటికి ముందు లేదా వెనక ఏదో ఒక ట్యాగ్‌లైన్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కల్కి పేరు మరింత హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ జూన్27న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఆదివారం(జూన్ 23) సాయంత్రం నుంచి తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
బుక్‌మై షో, పేటీఎం, జస్ట్ టికెట్స్ వంటి యాప్‌లలో ఆడియెన్స్ టికెట్స్ బుక్ చేస్తున్నారు. అయితే బుక్ మై షోలో కల్కి 2898 ఏడీ టికెట్‌ను బుక్ చేసుకుంటే రాజశేఖర్, ప్రశాంత్ వర్మ కాంబోలో గతంలో వచ్చిన కల్కి మూవీకి టికెట్ బుక్ అయినట్లు కనిపించింది. టికెట్‌ను త్వరగా బుక్ చేయాలన్న ఆలోచనలో యూజర్లు దాన్ని గమనించలేదు. మనీ ట్రాన్సెక్షన్ పూర్తైన తర్వాత టికెట్ డౌన్‌లోడ్ చేయగా, దానిపై రాజశేఖర్ కల్కి పోస్టర్ కనిపించింది. దీంతో సదరు ప్రేక్షకులు ఒక్కసారిగా కంగారు పడ్డారు.