Kalki 2898 AD Movie Review by Rajinikanth :పాన్ ఇండియా స్టార్ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. జున్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తొలి రోజే రూ. 190 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్, మన్మథుడు నాగార్జున వీక్షించారు. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.‘
కల్కి సినిమా అద్భుతంగా ఉంది. ఇండియన్ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ మరో స్థాయికి తీసుకెళ్లారు. మూవీలో నటించిన ప్రతిఒక్కరికీ, సినిమా కోసం పనిచేసిన అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఈ మూవో సెకండ్ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని రజనీ కాంత్ అన్నారు. ఈ పోస్ట్‌కు దర్శకుడు నాగ్ అశ్విన్ బదులిచ్చారు. మాటలు రావడం లేదన్నారు. టీమ్ అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పారు.
టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కూడా సోషల్ మీడియా వేదికగా కల్కి టీమ్క అభినందనలు తెలిపారు. నాగ్ అశ్విన్ మిమ్మల్ని ఒకసారి కలవాలి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మీరు అసలైన మాస్ హీరో. మీ యాక్టింగ్‌తో మరోసారి ఆశ్చర్యపరిచారు. రెండో భాగంలో కమల్ హాసన్‌ను చూడడం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రభాస్ నువ్వు మరోసారి సత్తా అదరగొట్టావు. దీపికా చాలా అద్భుతంగా నటించింది. మీరంతా కలిసి ఇండియన్ సినిమా స్థాయి ఏంటో మరోసారి నిరూపించారు అని కొనియాడారు. కాగా, సినిమాలో ప్రభాస్, అమితాబ్ యాక్షన్ సీన్స్, నాగ్ అశ్విన్ టేకింగ్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి.