తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కల్కి రిలీజ్ వాయిదా- కొత్త డేట్​ ఫిక్స్!- థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? - Kalki 2898 AD Release Date - KALKI 2898 AD RELEASE DATE

Kalki 2898 AD Release Date: రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి సినిమా రిలీజ్ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

Kalki 2898 AD Release Date
Kalki 2898 AD Release Date

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 6:32 PM IST

Updated : Apr 10, 2024, 8:09 PM IST

Kalki 2898 AD Release Date:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్​ రోల్​లో నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమా రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే మే 9న సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించినా, లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో కల్కి వాయిదా పడనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ రిలీజ్ గురించి మరోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా విడుదల మే 9 నుంచి మే 30 లేదా జూన్ 20కి షిఫ్ట్ అయిందని అంటున్నారు. అయితే సినిమా వాయిదా గురించి కానీ, కొత్త రిలీడ్ డేట్​ గురించి కానీ మూవీయూనిట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు..

యానిమేటెడ్ వీడియో
ఇదిలా ఉండగా 'కల్కి 2898 AD' సినిమా ఎలా ఉంటుంది? సైన్స్​ ఫిక్షన్​ జానర్ అంటే ఏంటి? ఈ అంశాలపై ఓ అవగాహన కల్పించేలా సినిమా థియేటర్లలోకి రాకముందు ఓటీటీలో ప్రీల్యూడ్ వీడియో రిలీజ్ చేయనున్నారు. ఇది యానిమేటెడ్​ వీడియో. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్​కు సొంతంగా ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారంట. ఈ వీడియో నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్​ చేసే ఛాన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముందుగా సినిమా టీజర్, తర్వాత పాటలు, ఆ తర్వాత ట్రైలర్​ రిలీజ్ చేసి చివరగా ఈ ప్రీల్యూడ్ వీడియో విడుదల చేయనున్నారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను సైన్స్​ ఫిక్షన్ జానర్​లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్​పై అశ్వినీ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్​ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తోంది. దీశా పటనీ, బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ మారుతి 'రాజాసాబ్' సినిమా షూటింగ్​లతో బిజీగా ఉన్నారు. ఇక సలార్ పార్ట్- 2 షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. 2025లో సినిమా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ తెలిపారు.

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ కజిన్​ - సినిమా టైటిల్ ఏంటంటే? - Prabhas Family Hero

'కల్కి'పై హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్​ - ఆ స్థాయిలో లేరంటూ! - Prabhas Kalki 2898 AD

Last Updated : Apr 10, 2024, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details