Kalki 2898 AD Release in Russia : అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సినిమాలు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రష్యాలో జరుగుతోన్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో భారతీయ చిత్రాలు సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సాధారణంగానే రష్యా సినీ ప్రియులు భారతీయ చిత్రాలను ప్రత్యేకంగా ఆదరిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 'ఆర్‌ఆర్‌ఆర్', 'కల్కి'పై కూడా మరోసారి తమ ప్రేమను చూపారు అక్కడి ప్రేక్షకులు.
ఈ 'ఆర్‌ఆర్‌ఆర్'(RRR), 'కల్కి 2898 ఏడీ'(Kalki 2898 AD) చిత్రాలను మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో ప్రదర్శించగా వాటికి సంబంధించిన వీడియోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఇక్కడి సినీ అభిమానులు వాటిని తెగ షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రెండేళ్ల క్రితమే విడుదలైన 'ఆర్‌ఆర్ఆర్'(RRR Russia) రష్యాలో భారీ విజయాన్ని దక్కించుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆ విజువల్ వండర్ మూవీని చూసేందుకు అక్కడి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఇప్పుడు 'కల్కి' చిత్రాన్ని కూడా అక్కడ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు నిర్మాతలు. స్వప్న దత్, ప్రియాంక దత్‌లు 'కల్కి'(Kalki 2898 AD Russia) చిత్రాన్ని రష్యా భాషలో డబ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వచ్చే నెలలో అక్కడ ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.