Kalki 2898 AD Prabhas New look Viral :బాహుబలి తరువాత ప్రభాస్ లుక్స్‌లో చాలా వరకు ఛేంజెస్ వచ్చిన సంగతి తెలిసిందే. అలానే ఆయన అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నారని కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన బాడీ ఫిట్‌నెస్‌పై పెద్దగా దృష్టి సారించలేకపోయారని ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. అయితే రీసెంట్గా సలార్‌తో బిగ్ సక్సెస్ అందుకున్న డార్లింగ్ త్వరలోనే కల్కి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం కోసం ప్రభాస్ కొత్త లుక్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ అయిన సంగతి తెలిసిందే.
అలానే రాజాసాబ్ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. అలా ఈ మధ్య ఈ మూవీ షూటింగ్ సెట్లో అడుగుపెట్టినప్పుడు ఆయనకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అయ్యాయి. గడ్డం, లాంగ్ హెయిర్‌తో టోపీ పెట్టుకుని కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు సంబంధించిన కొత్త లుక్ ఫొటోస్ మరింత క్లారిటీతో ఫేస్ రివీల్ అయ్యేలా కనిపించాయి. ప్రస్తుతం అవి ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి. కల్కి 2898 ఏడీ కోసం ఈ లుక్ అంటూ ఈ సినిమా హ్యాష్‌ట్యాగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఈ లుక్ చూసిన నెటిజన్లు, ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆ పిక్స్‌ను తెగ షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.
మరోవైపు నేడు(ఏప్రిల్ 23) నాగ్ అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రభాస్ స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. అద్భుతమైన దర్శకుడు నాగ్ అశ్విన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్కి విషయంలో నీ విజన్ నాకు స్ఫూర్తిని ఇస్తుంది అంటూ నాగ్ అశ్విన్ ఫొటో పోస్ట్ చేసి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.