Exercise Pill Tablet: ఆరోగ్యంగా ఉండడానికి రోజు వాకింగ్, రన్నింగ్ లాంటి వ్యాయామం చేస్తున్నారా? చెమట పట్టకుండా.. ఒక్క ఇంచు కుడా కదలకుండానే వీటి వల్ల కలిగే ప్రయోజనాలన్నీ పొందాలా? ఇది సాధ్యమే అంటున్నారు డెన్మార్క్‌లోని ఆర్హస్ యూనివర్సిటీ పరిశోధకులు. ఇందుకోసం పరిశోధనలు చేపట్టి లాక్టెస్, కేటోన్స్ రసాయనాలతో(Lake) అనే ఓ మాత్రను అభివృద్ధి చేశారు. దీనిని తీసుకుంటే ఉపవాసం, సుమారు 10 కిలోమీటర్లు వేగంగా పరిగెత్తితే కలిగే ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. ఈ విషయం జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమెస్ట్రీలో ప్రచురితమైంది. ఇది శరీరంలోని మలినాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుందని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ థామస్ పౌల్సెన్ వివరించారు. ఉపవాసం, సుమారు 10 కిలోమీటర్లు పరిగెత్తితే ఉండే సహజ జీవక్రియను ఇది అనుకరిస్తుందన్నారు. ప్రస్తుతం ఎలుకలపైన పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఈ మాత్రను తీసుకోవడం వల్ల ఇందులోని లాక్టెట్ రక్తంలో ఫ్లాస్మా స్థాయులు వేగంగా పెరిగేలా చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఇంకా కేటోన్స్ అనే beta-hydroxybutyrate రసాయనం కలిసి గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్, మానసిక సమస్యలు రాకుండా అడ్డుకుంటాయని పేర్కొన్నారు. ఆహారం ద్వారా ఈ మాత్రతో వచ్చే ప్రయోజనాలను పొందలేమని.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనందున నేరుగానే తీసుకోవాలని చెబుతున్నారు. ఇంకా Lake కేవలం వ్యాయామం కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తుందని మరో పరిశోధనలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా అధ్యయనం ప్రకారం.. ఇది జీర్ణక్రియ ఆరోగ్యంతో పాటు శరీర సామర్థ్యాన్ని పెంచుతుందని వివరించారు. అంతకుముందు పరిగెత్తే దానికంటే సుమారు 50శాతం అధికంగా రన్నింగ్ చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
ఈ ఎక్సర్సైజ్ మాత్రలపై దశాబ్దం కాలంగా ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయని నిపుణులు అంటున్నారు. ది గార్డియన్ నివేదిక ప్రకారం.. 2008లో GW501516 అనే డ్రగ్‌ను కనిపెట్టారు. ఇది చక్కెర స్థాయులను బదులుగా శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది. అయితే, ఇది అథ్లెట్లకు డోపింగ్ డ్రగ్‌గా పనిచేస్తున్నందున దీనిని 2015లో బ్యాన్ చేశారు. ఈ పరిశోధనలన్నీ శరీరంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపినట్లు నిపుణులు వివరించారు. డయాబెటిస్, ఊబకాయం, అల్జీమర్స్, పార్కిన్సన్, డిమెన్షియా లాంటి వ్యాధులు రాకుండా చేస్తుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కీళ్ల నొప్పులతో నడవలేకున్నారా? ఈ ఆహారం తింటే రన్నింగ్ చేస్తారట!