Selfie With Kalki Bujji:సినిమా ప్రమోషన్స్ అంటే అందులో లీడ్ రోల్స్ పోషించినవారో లేదా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇంక ఆ మూవీకి సంబంధించిన ఎవరైనా ఉంటారు. అయితే టాలీవుడ్లో మొదటిసారి ఒక కార్ మూవీని ప్రమోట్ చేయనుంది. తాజాగా ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ఆడియెన్స్‌కు పరిచయం చేసిన 'బుజ్జి' ఆ ప్రేక్షకుల దగ్గరికే వచ్చి 'కల్కి 2898 AD'ని ప్రమోట్ చేయడానికి సిద్దమైంది. ఐపీఎల్ సీజన్‌తో మొదలైన కల్కి సినిమా ప్రచారం ఫ్యూచర్ కార్ బుజ్జి రాకతో ఊపందుకుంది.
ఈ మూవీ మేకర్స్ బుజ్జికి సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్‌తో సంతృప్తిగా ఉన్నారని సమాచారం. అందుకే మరో అడుగు ముందుకు వేసి దేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో మూవీ యూనిట్‌తో పాటు ఈ కారును ప్రమోషన్స్‌లో భాగంగా తిప్పుతారంట. తమ నగరాలకు వచ్చినప్పుడు బుజ్జితో సెల్ఫీ తీసుకోవచ్చని ప్రేక్షకులు తెగ సంబరపడుతున్నారు. మామూలుగా హాలీవుడ్‌లోనే మూవీలో ఉన్న ఒక వస్తువుతో ప్రమోషన్స్ చేయడం చూశామని, ఇప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ వల్ల టాలీవుడ్లో కూడా ఒక సరికొత్త ట్రెండ్ మొదలుకానుందని నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బుజ్జిని పరిచయం చేసిన తర్వాత ఆటోమొబైల్ రివ్యూయర్స్తో పాటు మ్యాగజైన్స్ కూడా ఈ కార్ వీడియోలతో పాటు రివ్యూస్ రాశారు. అంతెందుకు ఈ మధ్యే టాలీవుడ్ యువసామ్రాట్ నాగచైతన్య కూడా ఈ కార్లో రైడ్ చేశారు. ఇక ఈ రూ.6 కోట్ల కార్ మూవీ రిలీజ్ కాకముందే ఇంత క్రేజ్ తెచ్చుకుందంటే విడుదల తర్వాత ఎలా ఉండనుందో? ఇక ఈ సినిమా షూటింగ్ పనులన్నీ రీసెంట్‌గానే పూర్తయ్యాయి.