తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హాలీవుడ్​ రేంజ్​లో 'కల్కి BGM'- ఇప్పుడిదే ట్రెండింగ్​- మీరు విన్నారా? - Kalki 2898 AD Release

Kalki 2898 AD BGM: హీరో ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న 'కల్కి 2898 AD' బీజీఎమ్ థీమ్ సోషల్​ మీడియాలో వైరలైంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్​ నారాయణన్ ఈ థీమ్​ను హాలీవుడ్ రేంజ్​లో కంపోజ్ చేశారని నెట్టింట టాక్ నడుస్తోంది.

Kalki 2898 AD BGM
Kalki 2898 AD BGM

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 7:51 AM IST

Updated : Feb 11, 2024, 9:01 AM IST

Kalki 2898 AD BGM: పాన్ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898' AD మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్​గా మారింది. సంగీత దర్శకుడు సంతోష్​ నారాయణన్ ప్రభాస్ ఫ్యాన్స్​కు కల్కిలో గ్రాండ్​ ట్రీట్ ఇవ్వనున్నారు. ఇటీవల రిలీజైన గ్లింప్స్​లో బ్యాక్ గ్రౌండ్​ స్కోర్ (BGM)​తో సినిమాపై అంచనాలు పెంచిన సంతోష్​ నారాయణన్, తాజాగా పవర్​ఫుల్ థీమ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. శనివారం చెన్నైలో జరిగిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్ (Music Concert)లో ఈ థీమ్ ప్లే చేశారు.

ఇది విన్న ఫ్యాన్స్ థీమ్ మ్యూజిక్ హాలీవుడ్ రేంజ్​లో ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ కాన్సర్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే ఈ థీమ్ అండ్ బీజీఎమ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్​ నారాయణన్ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. కాగా, సంతోష్ రీసెంట్​గా విక్టరి వెంకటేశ్ సైంధవ్​ సినిమాకు మ్యూజిక్ అందిచారు. ఇక గతంలో కబాలి, జిగర్​తండా, దసర, కాలా, మాస్టర్, గురు తదితర సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్​గా పనిచేశారు.

ఇక సినిమా విషయానికొస్తే, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జానర్​లో తెరకెక్కిస్తున్నారు. అలాగే సినిమాలో ఎంతోమంది ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులను భాగస్వామ్యం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్​ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశాపటానీ, కమల్​ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో డైరెక్టర్ అశ్విన్ కోమియో రోల్ ప్లాన్ చేస్తున్నారట. నేచురల్ స్టార్ నానితో పాటు యంగ్ టైగర్​ జూనియర్ ఎన్టీఆర్​ను​ క్లైమాక్స్​లో ఓ సీన్​లో చూపించనున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఒక్క సినిమాలో ఇంతమంది స్టార్ నటులను భాగస్వామ్యం చేయడం చూసి నాగ్ అశ్విన్ అంచనాలకు మించి గట్టిగా ప్లాన్​ చేస్తున్నారని అంటున్నారు. సినిమాకు వరల్డ్​వైడ్ క్రేజ్ దక్కేలా ప్రమోషన్స్ చేయనున్నారు. అందులో భాగంగానే ఇదివరకు కామిక్ కాన్ ఈవెంట్​లో మూవీటీమ్ పాల్గొంది. గ్లింప్స్​కూడా అక్కడే రిలీజ్ చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రభాస్​ 'కల్కి'లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు​ - స్క్రీన్​ను షేక్​ చేసే రోల్స్​లో!

ఆ సెంటిమెంట్ డేట్​కే ప్రభాస్ 'కల్కి' - చిరు సినిమా రోజే థియేటర్లలోకి

Last Updated : Feb 11, 2024, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details