Amitabh bachchan Statue Google Maps : సినీ ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ అభిమానించే నటుడు అమితాబ్ బచ్చన్. తన విలక్షణ నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల మనసుల్ని గెలుచుకున్నారు. అయితే ఆయనపై ప్రేమతో ఓ అభిమాని చేసిన పనిని గూగుల్ కూడా మెచ్చుకుంది. న్యూ జెర్సీకి చెందిన గోపీసేథ్ ఆ మధ్య - అమితాబ్ విగ్రహాన్ని ఏకంగా తన ఇంటి ముందే ఏర్పాటు చేయించాడు. తాజాగా ఇప్పుడది గూగుల్ గుర్తింపు పొందింది. న్యూజెర్సీ ప్రాంతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గూగుల్ దీన్ని గుర్తించడం విశేషం. దీంతో అమితాబ్ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తన నివాసం ఓ పర్యాటక ప్రాంతంగా మారడంతో అమితాబ్ అభిమాని గోపీసేథ్ చాలా సంతోషిస్తున్నారు. ఇందుకు కారణం అమితాబ్ బచ్చనే అంటూ ఆయనపై ఉన్న అభిమానాన్ని మరోసారి తెలిపారు. "మా ఇళ్లు ఇప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారింది. దానికి అమితాబ్ విగ్రహానికి ధన్యావాదాలు. గూగుల్ కూడా ఈ ప్రాంతాన్ని గుర్తించడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతుంది. ఆయన విగ్రహాన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు. రోజుకు కనీసం 20 నుంచి 25కార్లలో టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన వారంతా అమితాబ్ పై తమకున్న అభిమానాన్ని చాటుతూ ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డులు ఇచ్చి వెళ్తున్నారు. విగ్రహంతో ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతానికే ప్రాముఖ్యత పెరిగింది"
ఎడిసన్ సిటీలో నివసిస్తున్న గోపీసేథ్ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త. 1991తొలిసారి అమితాబ్‌ను కలిసినప్పటి నుంచీ ఆయనకు వీరాభిమాని అయ్యారట గోపీ. బచ్చన్ సాబ్‌కు ఇతని కుటుంబ సభ్యులు కూడా వీరాభిమానులే. వీరికి అమితాబ్ దేవుడితో సమానమట. ఈ కారణంగానే గోపీసేథ్ 2022లో అమితాబ్ విగ్రహాన్ని తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్నట్లు విగ్రహావిష్కరణ సమయంలో తెలిపారు.
అమితాబ్ అభిమాని చేసిన పని - గుర్తించిన గూగుల్ మ్యాప్! - Amitabh Bachan statue
Amitabh bachchan Statue Google Maps : కల్కి 2898 ఏడీ అశ్వత్థామ అమితాబ్ బచ్చన్‌పై అభిమానంతో ఆయన ఫ్యాన్స్ చేసిన ఓ పనిని గూగుల్ మ్యాప్ గుర్తించింది. పూర్తి వివరాలు స్టోరీలో
Amitabh Bachchan (source ANI)
Published : Jul 29, 2024, 12:41 PM IST