తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆడిషన్స్​లో అలా చేయలేకపోయా - మా నాన్న తిట్టాక ఓకే అయ్యింది' - Kajal Aggarwal First Movie Audition - KAJAL AGGARWAL FIRST MOVIE AUDITION

Kajal Aggarwal First Movie Auditions : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన మొదటి సినిమా ఆడిషన్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. డైరెక్టర్ తేజ చెప్పినట్లు చేయలేకపోయనంటూ వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగింది.

Kajal Aggarwal
Kajal Aggarwal (Source : ETV Bharat Archives)

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 4:19 PM IST

Kajal Aggarwal First Movie Auditions :సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్​ఫుల్ హీరోయిన్లలో ఒకరు కాజల్ అగర్వాల్. 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది, ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్నీ భాషల్లోనూ పలు హిట్ సినిమాల్లో నటించి అనతికాలంలోనే స్టార్​డమ్​ పొందింది. రోల్ ఏదైనా సరే అలవోకగా నటించి అభిమానులను మెప్పిస్తుంటుంది.

అయితే ఈ చిన్నది తన తొలి ఆడిషన్స్ ఎలా ఇచ్చిందో తెలుసా ? ఇదే విషయాన్ని తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా సీజన్​ 2లో చెప్పింది. తన అప్​కమింగ్ మూవీ 'సత్యభామ' ప్రమోషన్స్​లో భాగంగా డైరెక్టర్ సుమన్‌ చిక్కాలతో కలిసి షో లో సందడి చేసింది. తన కెరీర్​తో పాటు పర్సనల్ విషయాల గురించి మాట్లాడింది.

"లైఫ్​లో నా ఫస్ట్ ఆడిషన్స్​ అది. తేజ నన్ను ఏడవమన్నారు. అయితే నేను నా లైఫ్​లో ఏడవడానికి ఏం రీజన్​ లేదు. నా మైండ్​లో ఎటువంటి ఆలోచనలు రావట్లేదు. నేను ఏడవలేకపోతున్నా అని అన్నాను. వెంటనే మా నాన్న నాతో ఏదో అన్నారు. అది విని నాకు ఏడుపొచ్చింది. అలా ఆ ఆడిషన్స్​లో నేను సెలక్ట్ అయ్యాను." అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుంది.

పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ తన సెకెండ్ ఇన్నింగ్స్​లో దూసుకెళ్తోంది. ఓ వైపు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే ఎప్పుడూ సాఫ్ట్​ రోల్స్​ చేస్తూ వచ్చిన కాజల్ ఇప్పుడు రూట్ మార్చి ఫీమేజ్ ఓరియెండట్ మూవీస్​ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.

ఇందులో భాగంగా 'సత్యభామ' అనే సినిమా అనౌన్స్​ చేసింది. ఓ సూపర్ కాప్​గా తన పరిధిలోనీ కేసులను సాల్వ్ చేస్తూ వస్తున్న సత్యభామ అనుకోకుండా ఓ అమ్మాయి హత్య కేసును ఛేదించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి ?అనే ఆసక్తికర కోణంలో ఈ సినిమా సిద్ధమైనట్లు టీజర్​లో చూపించారు మేకర్స్. ఇక కాజల్ తనలోని యాక్షన్ కోణాన్ని చూపించి ప్రేక్షకులను అబ్బురపరిచింది. విలన్లను చితక్కొడుతూ సూపర్​ పోలీస్​ ఆఫీసర్ పాత్రలో మెరిసింది. ఇక మే 17న ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది.

మరోసారి బాలయ్యతో కాజల్​ అగర్వాల్​! - NBK 109 Movie

'చందమామ' కాజల్ - ఈ బ్యూటీకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

ABOUT THE AUTHOR

...view details