Vidya Balan Kahaani Movie :ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. బడ్జెట్‌తో సంబంధం లేకుండా చిన్న చిత్రాలు కూడా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. ఆయా స్టార్ల కెరీర్లను ఓ రేంజ్‌లోకి తీసుకెళ్లాయి కూడా. కథ బాగుంటే ఎటువంటి సినిమాను అయినా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకాన్ని నిలబెట్టిన రోజులు కూడా సినీ ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.
అయితే పెద్ద బడ్జెట్, స్టార్ హీరో ఉంటేనే సినిమా నడుస్తుందన్న కాలంలోనూ ఓ సినిమా ఈ అంచనాలన్నింటినీ దాటి చరిత్రెక్కెక్కింది. 2012లో వచ్చిన ఈ హీరోయిన్ ఓరియెంటడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మాసివ్ టాక్ అందుకోవడమే కాకుండా అందులోని హీరోయిన్ స్టార్డమ్న మరింత పెంచింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించిన 'కహానీ'.
ఆ ఏడాదిలో విడుదలైన సినిమాలలో బెస్ట్ సినిమాలలో ఇది ఒకటి. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూ.104 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ సాధించింది. ఒక గర్భవతిగా విద్యా బాలన్ నటనకు చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఉత్తమ నటిగా అవార్డులతో పాటు ఆ చిత్ర దర్శకుడు సుజయ్ ఘోష్ కు కూడా చాలా అవార్డులు వచ్చాయి. బెస్ట్ కథ, స్క్రీన్ ప్లే తో ఆ ఏడాది 3 జాతీయ అవార్డులు ఈ మూవీ సొంతం చేసుకుంది.