JR NTR Line up:నందమూరి నటవారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ విషయంలో ప్రస్తుతం ఏం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? నెక్స్ట్ ఏ చిత్రం ప్రారంభం అవుతుంది? అనే విషయంలో అసలు స్పష్టత లేదు. అంతకుముందు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర పూర్తైపోగానే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని, అది కంప్లీట్ అవ్వగానే వార్ 2 ఉంటుంది అన్నారు.
కానీ ఆ తర్వాత దేవర, వార్ 2, ఎన్టీఆర్ 31(ప్రశాంత్ నీల్)గా లైనప్ మారింది. ఇప్పుడు ఇది కూడా వర్కౌట్ అయ్యేలా సూచనలు కనిపించట్లేదు. ఎందుకంటే ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవర - విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు గాయాలు అవ్వడం వల్ల షూటింగ్ డిలే అయింది. మూవీ పోస్ట్ పోన్ అయింది. సరే దేవర డిలే టైమ్‌లో తారక్ వార్ 2 అయినా మొదలు పెడతారని భావిస్తే ఇప్పుడు వార్ 2లో(NTR WAR 2 Movie) హృతిక్ రోషన్‌కు గాయాలయ్యాయి. షూటింగ్లో పాల్గొనే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో వార్ 2 షూట్ ఇప్పట్లో షురూ అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఒకవేళ హృతిక్ లేని సీన్స్‌ను పక్కనపెట్టి తారక్‌తో వార్ 2 చిత్రీకరించినా కూడా ఆ తర్వాత వారిద్దరు కలిసి నటించాల్సిన సీన్స్ ఉంటాయి. దీని కోసం తారక్ మళ్లీ డేట్స్‌ను అడ్జెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా కూడా సలార్ 2 తర్వాతే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.