Devara Run Time:గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర పార్ట్ 1' సినిమా నుంచి రీసెంట్గా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. అంతేకాకుండా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచి లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. అయితే సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇక తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. కాగా, సినిమా రన్‌టైమ్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల పాటు ఉండనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్‌తో తీసిన సినిమా కావడం వల్ల దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మూవీలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్ అని హీరో ఎన్టీఆర్ ముంబయిలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ అంచనాలు రెట్టింపు చేశారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. ఇక మరాఠీ భామ శృతి మరాఠే కీలప పాత్రలో కనిపించనుంది. నటులు శ్రీకాంత్, గెటప్ శ్రీను తదితరులు ఆయా పాక్రలు పోషించారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన మూడు పాటలకు కూడా మంచి క్రేజ్ లభించింది.