తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దేవర కోసం గోవాకు తారక్- సైఫ్​తో యాక్షన్ సీన్స్ కోసమేనట! - Jr NTR Devara Shooting Update

Jr NTR Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉంటున్నారు. అయితే సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారనే వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో కనిపించడం ఆయన అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.

DEVARA  NTR
DEVARA NTR

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 7:44 PM IST

Jr NTR Devara Update: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్​గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పటికే కీలక సన్నీవేశాలు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఇక మూవీటీమ్ షూటింగ్​కు బ్రేక్ తీసుకున్నట్లు రీసెంట్​గా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తారక్ సోమవారం ఎయిర్​పోర్ట్​లో దర్శనమిచ్చారు. న్యూ లుక్​లో ఆయన గోవా వెళ్తున్నట్లు తెలిసింది. దీంతో తారక్ ప్రయాణం 'దేవర' కోసమే అంటూ సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

అయితే మూవీటీమ్ గోవాలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసిందట. తదుపరి షూటింగ్ అంతా అక్కడే ఉంటుందని, దీని కోసమే ఎన్టీఆర్ గోవాకు వెళ్లారని తెలుస్తోంది. కొత్త షెడ్యూల్​లో భాగంగా గోవాలో యాక్షన్ సీక్వెల్స్​తో పాటు ఓ పాట చిత్రీకరించాలనీ 'దేవర' టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎన్టీఆర్​తో పాటు ఫిట్​నెస్ ట్రైనలర్ కుమార్ మన్నవా కూడా గోవా ప్రయాణం అయ్యారు. వీరితో పాటు సినిమాలో విలన్ రోల్​లో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్,​​ బ్యూటీ క్వీన్ జాన్వీ కపూర్, ఇతర నటీనటులు కూడా ఈ షెడ్యూల్​లో పాల్గొననున్నారు. అక్కడ జరగనున్న షూటింగ్ కోసం దేవర చిత్ర యూనిట్ ఇప్పటికే అన్నీ సిద్ధం చేశారని, రేపే (మార్చి 19) ఈ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు ఇన్​సైడ్ టాక్.

ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇక 'ఆర్​ఆర్ఆర్​' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న 'దేవర'పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఏప్రిల్​లో సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్​ తొలుత ప్రకటించినప్పటికీ పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఈటీవల సినిమా కొత్త డేట్​ను కూడా మేకర్స్ అనౌన్స్​ చేశారు. 2024 అక్టోబర్ 10న దేవర ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

'దేవర'లో ఎన్​టీఆర్ ట్రిపుల్ రోల్ కన్ఫార్మ్- ప్రూఫ్ ఇదే!

ఆ 3 సవాళ్లను బ్రేక్ చేస్తేనే 'దేవర' సక్సెస్​ - తారక్ ఏం చేస్తారో?

ABOUT THE AUTHOR

...view details