తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'దేవర' సక్సెస్ సెలబ్రేషన్స్ - లొకేషన్ కోసం మేకర్స్​ సెర్చింగ్​! - Devara Success Meet - DEVARA SUCCESS MEET

Devara Success Meet : పాన్ఇండియా స్టార్ ఎన్టీఆర్ నటించిన 'దేవర పార్ట్ 1' సెప్టెంబర్ 27న రిలీజై మంచి విజయం అందుకుంది. దీంతో మేకర్స్ త్వరలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసే ప్లాన్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

Devara Success Meet
Devara Success Meet (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2024, 10:01 PM IST

Devara Success Meet :గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లీడ్ రోల్​లో తెరకెక్కిన 'దేవర పార్ట్ 1' ఈనెల 27న రిలీజై మంచి విజయం సాధించింది. తొలి రోజు వరల్డ్​వైడ్ రూ. 172కోట్ల గ్రాస్​తో బాక్సాఫీస్ వద్ద సత్తాచాటిన ఈ సినిమా ముడు రోజుల్లోనే రూ. 300 కోట్ల మార్క్ అందుకున్నట్లు మేకర్స్ సోమవారం ప్రకటించారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద దేవర పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది.

అయితే సినిమాను విజయవంతం చేసిన ఫ్యాన్స్​ కోసం మేకర్స్ సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే లొకేషన్ కోసం సెర్చింగ్ కూడా ప్రారంభించారని సమాచారం. ఇటీవల హైదరాబాద్ నోవాటెల్​లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఫ్యాన్స్ నిరాశ చెందారు. అందుకనే పక్కా ప్లానింగ్​తో గ్రాండ్​గా సక్సెస్ మీట్ నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు మొదలెట్టేశారని తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.

ప్రీ రిలీజ్ క్యాన్సిల్
సెప్టెంబర్ 22న సాయంత్రం హైదరాబాద్​ నోవాటెల్​లో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈవెంట్​కు అనూహ్యంగా అంచనాకు మించి అభిమానులు రావడం వల్ల నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో తీవ్ర నిరుత్సాహంతో అభిమానులు వెనుదిరిగారు. దీనిపై హీరో ఎన్టీఆర్ అప్పుడే స్పందించారు. ఈవెంట్ రద్దు అవ్వడం వల్ల ఫ్యాన్స్​ కంటే ఎక్కువగా తానే బాధపడుతున్నట్లు చెప్పారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది. మరో వారం దాకా ఇతర సినిమాలు లేకపోవడం, దసరా సెలవులు కలిసొచ్చాయి. దీంతో లాండ్ రన్​లో దేవర వరల్డ్​వైడ్​గా రూ. 500 కోట్లు వసూల్ చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సముద్రం బ్యాక్​డ్రాప్​లో హై లెవెల్ వీఎఫ్ఎక్స్​తో గ్రాండ్​గా చిత్రాన్ని రూపొందించారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్​లో కనిపించి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించింది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారు. శ్రీకాంత్, శ్రుతి మరాఠే, ప్రకాశ్ రాజ్, అజయ్ తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా, యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కింది.

ప్రీ రిలీజ్ రద్దు బాధాకరం - కానీ సినిమా చూసి కాలర్ ఎగరేస్తారు! - Devara Pre Release

'దేవర' బిజినెస్ లెక్కలు ఇవే! - ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరో తెలుసా? - NTR Devara Movie

ABOUT THE AUTHOR

...view details