ETV Bharat / entertainment

పాటలకే రూ.75 కోట్లు- 'గేమ్ ఛేంజర్' సాంగ్స్​ ఒక్కోటి ఒక్కో లెవెల్​ - GAME CHANGER SONGS

విజువల్ ట్రీట్​గా 'గేమ్ ఛేంజర్' పాటలు- తొలిసారి ఆ టెక్నాలజీ వాడిన శంకర్

Game Changer Songs
Game Changer Songs (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2025, 3:44 PM IST

Game Changer Songs : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' మరో 8 రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటికే సినిమాలోని పాటలు రిలీజ్ చేశారు. అయితే గ్రాండియర్‌ విజువల్స్‌కు కేరాఫ్‌ అడ్రస్​గా పేరున్న డైరెక్టర్ శంకర్ ఈ సినిమాలో తన మార్క్ చూపించారు. ఎక్కడా రాజీ పడకుండా పాటలను గ్రాండ్ విజువల్స్​తో తెరకెక్కించారు. నాలుగు పాటలకు దాదాపు రూ.75 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

జరగండి, జరగండి : ఈ సినిమా నుంచి రిలీజైన తొలి పాట 'జరగండి,జరగండి'. ఈ సాంగ్​ విజువల్స్​ చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. 600 మంది డ్యాన్సర్లతో కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సూపర్ స్టెప్పులేయించారు. 13 రోజుల పాటు షూటింగ్‌ చేశారు. 70 అడుగుల ఎత్తయిన కొండ, విలేజ్‌ సెట్‌, అందుకు తగిన కాస్ట్యూమ్స్‌, అన్నింటినీ పర్యావరణహితమైన జనపనారతో తయారు చేయడం విశేషం. ఈ పాటకు ఒక్క తెలుగులోనే ఇప్పటికే 50+ మిలియన్ వ్యూస్ వచ్చాయి.

1000 మంది డ్యాన్సర్లు : రెండో పాట 'రా మచ్చా'కూడా యూత్​ను ఆకట్టుకుంటోంది. గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 1000 మందికిపైగా జానపద కళాకారులు డ్యాన్స్​ చేశారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన కళాకారులు నృత్యం చేశారు. గుస్సాడీ (ఆదిలాబాద్‌), చావ్‌ (పశ్చిమ బెంగాల్‌), ఘూమ్రా (ఒడిశా-మట్టిల్కల), గోరవర -కుణిత (కర్ణాటక), రణప-(ఒడిశా), పైకా -(ఝార్ఖండ్‌), హలక్కీ-ఒక్కలిగ-(కర్ణాటక). తప్పెటగుళ్లు- (విజయనగరం), దురావా-(ఒడిశా) నృత్య రీతులు ఇందులో కనిపిస్తాయి.

తొలి ఇండియన్‌ సాంగ్‌ : 'నానా హైరానా' అంటూ మూడో పాట చక్కగా అలరిస్తోంది. ఈ సాంగ్​తో శంకర్ కొత్త టెక్నాలజీ పరిచయం చేశారు. ఈ పాటను ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాతో షూట్ చేశారు. అయితే ఈ టెక్నాలజీతో షూట్ చేసిన తొలి ఇండియన్ సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్​లో చెర్రీ, కియారా అడ్వాణీ క్యాస్టూమ్స్​కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

'దోప్‌' సాంగ్ : అమెరికా ఈవెంట్​లో నాలుగోపాట 'దోప్‌'ను రిలీజ్ చేశారు. ఈపాట సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యింది. కొవిడ్ సెకండ్ వేవ్​లో ఈపాట షూటింగ్ జరిగిందంట. ప్రఖ్యాత రామోజీఫిల్మ్‌ సిటీలో 8 రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరిగింది.

'వేవ్స్‌' అసలైన గేమ్‌ ఛేంజర్‌ : ప్రధాని మోదీపై రామ్ చరణ్​ ప్రశంసల జల్లు

256 ఫీట్ల రామ్​చరణ్​ భారీ కటౌట్- మెగా ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.