SSMB 29 Bollywood Actors :సూపర్ స్టార్ మహేశ్ బాబు- రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోంది. 'SSMB29' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతోంది. రీసెంట్గా మహేశ్ పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా, రాజమౌళి వీడియో షేర్ చేశారు. దీంతో సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ ప్రాజెక్టులో మరో బాలీవుడ్ స్టార్ భాగం కానున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. పృథ్వీతో మూవీ టీమ్ చర్చలు కూడా జరిపిందని, ఆయన ఓకే కూడా చెప్పినట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే పృథ్వీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులో లేరని ప్రచారం సాగుతోంది. పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంను తీసుకున్నట్లు సినీ వర్గాల టాక్. త్వరలోనే ఆయన షూటింగ్లో పాల్గొననున్నారని సమాచారం.
సుకుమారన్ రియాక్షన్
ఈ చిత్రంలో తాను భాగం కావడంపై మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 'ఈ సినిమా గురించి నాకంటే ఇతరులకే ఎక్కువ తెలిసినట్లుంది. ఇంకా నా పాత్ర ఏంటనేది కన్ఫార్మ్ కాలేదు. చాలా చర్చించాల్సి ఉంది. కాబట్టి అంతా సవ్యంగా జరిగిన తర్వాత చూద్దాం' అని వ్యాఖ్యానించారు.