Jayam Ravi Divorce :'పొన్నియిన్ సెల్వం' ఫేమ్ ప్రముఖ కోలీవుడ్ నటుడుజయం రవి తాజగా సంచలన ప్రకటన చేశారు. తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరూ విడాకులు తీసుకోనున్నట్లు నెట్టింట వార్తలు వచ్చాయి. అయితే నేడు అదే విషయాన్ని ఖరారు చేస్తూ రవి ఓ పోస్ట్ పెట్టారు. ఇష్టపూర్వకంగానే తాము విడాకులు తీసుకుంటున్నట్లు ఆ లెటర్లో ఆయన తెలిపారు.
"జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ఓ ప్రయాణం లాంటిది. ఇందులో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీలో చాలామంది నన్ను ఆదరించారు అలాగే నాకు మద్దతుగానూ నిలిచారు. అందుకే నేనెప్పుడు నా అభిమానులతో, మీడియాతో ట్రాన్స్పరెంట్గా, అలాగే నిజాయతీగా ఉంటాను. అందుకే నేడు మీ అందరితోనూ ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నాను. భారమైన హృదయంతో ఈ విషయాన్ని మీకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు, చర్చల జరిపిన తర్వాత నేను, నా వైఫ్ ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి ప్రయోజనం కోసమే ఇలా చేస్తున్నాం. ఈ సమయంలో మాతో పాటు మా కుటుంబసభ్యుల ప్రైవసీని గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను. దీనిపై రూమర్స్, ఆరోపణలు మానేయాలని కోరుతున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. నేను సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మూవీస్ విషయంలో నా ప్రాధాన్యం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం నేను కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటాను. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. నాకు ఎప్పటికీ మీరు ఇలానే మద్దతిస్తారని ఆశిస్తున్నాను" అంటూ జయం రవి ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.