Janhvi Kapoor Praises NTR : తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా టాలీవుడ్‌తో పాటు తన కోస్టార్ ఎన్టీఆర్‌లపై ప్రశంసల జల్లును కురిపించింది. దీంతో పాటు 'దేవర' షూటింగ్ అనుభవాలను పంచుకుంది.
"తెలుగువారి పనితీరు నాకు ఎంతో ఇష్టం. వారు కళను అలాగే సినిమాను గౌరవిస్తారు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు. కథపై నమ్మకంతోనే పనిచేస్తారు. ప్రస్తుతం నేను తెలుగులో 'దేవర' సినిమాలో చేస్తున్నాను. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఓ ఎనర్జిటిక్ హీరో. ఆయన రాక సెట్‌కే కళను తెస్తుంది. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. తాజాగా జరిగిన ఓ షెడ్యూల్‌లో మా ఇద్దరిపై స్పెషల్ సాంగ్‌ను షూట్ చేశారు. ఆయన డ్యాన్స్ వేగాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన ఒక్క సెకనులో ఎటువంటి విషయాన్నైనా నేర్చుకోగలరు. అదే విషయాన్ని నేర్చుకోవడానికి నాకు కనీసం 10 రోజులైనా కావాల్సి ఉంటుంది. ఆయనతో పాటు మరో నెక్స్ట్ సాంగ్ షూట్ ఉంటే దాని కోసం నేను ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను. డైరెక్టర్ కొరటాల శివ ఎప్పుడూ ఎంతో కూల్‌గా ఉంటారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు ఆయనే కెప్టెన్. ఎటువంటి విషమైనా ఆయన ఎంతో సున్నితంగా చెబుతుంటారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తల్లిదండ్రులు నేర్పారు. వాళ్లతో పాటు నా అభిమానులంతా గర్వపడేలా ఉంటాను. ప్రస్తుతం ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. నా రిలేషన్షిప్ గురించి రివీల్ చేసే టైమ్ నాకు లేదు. ఆరోగ్యపరంగానూ నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నాను" అని జాన్వీ చెప్పారు.