తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'జై హనుమాన్' దీపావళి సర్​ప్రైజ్- ఆంజనేయుడి పాత్రలో రిషభ్ శెట్టి కన్ఫార్మ్​

ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అప్డేట్- ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్

Jai Hanuman First Look
Jai Hanuman First Look (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Jai Hanuman First Look :సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి టాలీవుడ్​ యంగ్ డైరెక్టర్​ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం 'హను- మాన్‌'. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం, స్టార్ హీరోల చిత్రాన్ని అధిగమించి బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా లెవల్​లో ఆడియెన్స్​ను ఆకట్టుకుంది.

అయితే దీనికి సీక్వెల్​గా 'జై హనుమాన్​' రానున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ హనుమాన్ సీక్వెల్​ రూపుదిద్దుకోనుంది. తాజాగా దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అదిరే​ అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్​. ఫస్ట్ లుక్ పోస్టర్​ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'త్రేతాయుగం నుంచి ఒక ప్రతిజ్ఞ కలియుగంలో నెరవేరుతుంది. ఈ దీపావళికి 'జైహనుమాన్' అనే పవిత్ర శ్లోకంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిద్దాం' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే ఈ సీక్వెల్​లో హనుమంతుడి పాత్ర పోషించేది ఎవరు? అనే ప్రశ్నకు మేకర్స్ తెర దించారు. తొలి నుంచి ప్రచారం సాగినట్టుగానే జాతీయ అవార్డు విజేత రిషబ్ శెట్టి ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ PVCUలో ఈ జై హనుమాన్ సినిమా తెరకెక్కనుంది.

ఇప్పటికే 'హను- మాన్‌'కు మించి వందరెట్లు భారీ స్థాయిలో 'జై హనుమాన్‌' ఉంటుందని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెలిపారు. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదని, కానీ సీక్వెల్‌లోనూ సజ్జా హనుమంతు పాత్ర ఉంటుందని అన్నారు. అయితే 'జై హనుమాన్'​ ఆంజనేయ స్వామి పాత్రను స్టార్‌ హీరో చేస్తారని పేర్కొన్నారు.

ఈ 'జై హనుమాన్' చిత్రంతో పాటు, 'అధీర', 'మహాకాళి' చిత్రాలు కూడా ప్రశాంత్ వర్మ పీవీసీయూ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగానే రానున్నాయి. మరోవైపు నందమూరి నట వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి కూడా ప్రశాంత్‌ వర్మనే దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇది పీవీసీయూలో భాగమా కాదా అనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది.

'జై హనుమాన్'​ కంటే ముందే ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం : ప్రశాంత్ వర్మ - Prasanth Varma Jai Hanuman Movie

ప్రశాంత్ వర్మ షాకింగ్ డెసిషన్- ఆ స్టార్ కోసం 'జై హనుమాన్' పోస్ట్​పోన్! - Prashanth Varma

ABOUT THE AUTHOR

...view details