Jagapathi Babu Birthday Post :90స్లో ఫ్యామిలీ హీరోగా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు స్టార్ హీరో జగపతిబాబు. తన నటనతో అభిమానులను ఎమోషనల్ చేసిన ఈ స్టార్ ఇప్పుడు పవర్ఫుల్ విలన్‌గా కనిపిస్తూ తనలోని కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. అంతే కాకుండా అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇప్పటి యూత్‌కు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా నటిస్తున్నారు. తాజాగా ఆయన 63వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్‌కు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నుంచి విషెస్ వెల్లువ మొదలైంది.
అయితే జగపతిబాబు కూడా తన ఫ్యాన్స్ కోసం ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆయన చేతిలో రెండు బాటిళ్లు పట్టుకుని ఉన్నారు. అందులో ఒకటి పాలు, ఇంకొంటి మద్యం సీసా. అయితే జగపతి బాబు 'ఇందులో నన్ను ఏది తాగమంటారు' అంటూ ఫ్యాన్స్‌ను సరదాగా అడిగారు.
"ఎలాగోలా పుట్టేశాను. సిగ్గు లేకుండా అడుగుతున్న, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. రెండోది ఎక్కువసేపు ఆలోచించకుండా తొందరగా డిసైడ్ చేయండి. ఈ రెండిట్లో ఏది కొట్టమంటారు" అంటూ బాటిళ్లతో దిగిన ఓ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఒక్క సెకన్ షాకైనప్పటికీ, ఆయన హ్యూమర్‌ను అర్థం చేసుకుని కాసేపు నవ్వుకున్నారు. ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్తున్నారు.