Jackie chanKarate Kid : Legends - ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్షన్ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేని పేరు జాకీ చాన్. మార్షల్ ఆర్ట్స్ ధీరుడైన ఈయన తనదైన యాక్షన్‌తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా 90ల నాటి పిల్లలైతే, ఆయన సినిమాలు చూస్తూనే పెరిగారంటే అతిశయోక్తి లేదేమో.
అయితే తన కెరీర్లో నిర్మాతగా, నటుడిగా నిరూపించుకున్న జాకీ చాన్, ఇప్పుడు మరో కొత్త సినిమాతో తన యాక్షన్‌ను మరోసారి రుచి చూపించడానికి రెడీ అవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో 'కరాటే కిడ్ :లెజెండ్స్' రాబోతుంది. హాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన కరాటే కిడ్ ఫ్రాంచైజీలో రూపొందుతున్న ఆరో చిత్రమిది.
రాల్ఫ్ మాచియో, బెన్‌వాంగ్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని జోనాథన్ ఎంట్విస్ట్లే తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. "రెండు కొమ్మలు, ఒకే చెట్టు, జాకీ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారు" అని వ్యాఖ్యల్ని రాసుకొచ్చింది.