Suriya Kanguva 2 Deepika Padukone :కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'కంగువా'. శివ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ ఫాంటసీ చిత్రం గురువారం బాక్సాఫీసు ముందుకొచ్చి మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా సోషల్ మీడియా వేదికగా విలేకరులతో ముచ్చటించారు.
ఈ క్రమంలోనే కంగువా 2లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె నటించనున్నారా? అని అడగ్గా - "పార్ట్ 1కు వచ్చిన ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2లో కొన్ని మార్పులు చేస్తాం. అయితే కొత్తగా ఎవరు నటిస్తారన్నది ఇంకా ఖరారు చేయలేదు" అని అన్నారు.
కాగా 1000 ఏళ్ల కిందటి కథకి, వర్తమానానికి ముడిపెడుతూ కంగువా చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ కాన్వాస్‌తో ఈ చిత్రం రూపొందింది. చిత్రంలో కంగువా, ఫ్రాన్సిస్ పాత్రల్లో సూర్య నటన ప్రేక్షకులను బాగా ఆకట్టకుంది. దిశా పటానీ చిన్న పాత్రలోనే మెరిసినప్పటికీ అందంతో ఆకట్టుకుంది. బాలీవుడ్ స్టార్ బాబీ దేవోల్ ప్రతినాయకునిగా కనిపించి మెప్పించారు.
అయితే, ఈ కంగువా చిత్రంలోని కొన్ని సీన్స్‌లో సౌండ్ ఇబ్బందికరంగా ఉందని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై సౌండ్ ఇంజినీర్ రసూల్ కూడా స్పందించారు. అలాంటి పీరియాడికల్ సినిమాలకు సంగీతం అందించడం యుద్ధంతో సమానమని చెప్పారు. సౌండ్ బాలేదని అంటూ ఎవరినీ నిందించలేమని అన్నారు.