Laapataa Ladies Oscars 2025 :2025 ఆస్కార్ పోటీలకు భారత్ నుంచి ఎంపికైన 'లాపతా లేడీస్'కు నిరాశే మిగిలింది. ఈ సినిమా టాప్ 10లో స్థానం సాధించడంలో విఫలమైంది. ఉత్తమ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ విభాగంలో షార్ట్‌లిస్ట్ చేసిన టాప్ 10 సినిమాల జాబితాలో 'లాపతా లేడీస్' పేరు లేదు. దీంతో అధికారికంగా 'లాపతా లేడీస్' ఆస్కార్ రేస్ నుంచి తప్పుకున్నట్లైంది. ఈ లిస్ట్‌లో బ్రెజిల్, కెనడాకు చెందిన చిత్రాలు టాప్‌లో నిలిచాయి.
కాగా, డైరెక్టర్ కిరణ్‌రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM)' అవార్డుల్లో క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. అలాగే ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తోపాటు, సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకలో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని సి- బ్లాక్‌లోని ఆడిటోరియంలో ప్రదర్శించడం విశేషం.
ఇదీ కథ
2001 కాలం బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రూపొందింది. పల్లెటూరికి చెందిన ఇద్దరు కొత్త పెళ్లి కూతుర్లు తమ అత్తారింటికి వెళ్లే సమయంలో ఓ రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైపోతారు. ఇది తెలియని పెళ్లికొడుకులు ఆ అమ్మాయిలను ఇంటికి తీసుకెళ్తారు. తీరా చూసుకున్నాక అసలు నిజం బయటపడుతుంది. అయితే ఈ మార్పు వల్ల ఆ ఇద్దరి అమ్మాయిల జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందనేదే మిగతా కథ.