Neha Kakkar Career:అందరి లక్ష్యాలు, కోరికలు ఒకేలా ఉండవు. విభిన్న రంగాల్లో రాణించాలని, గుర్తింపు పొందాలని కలలు కంటుంటారు. కానీ సక్సెస్ అంత సులువుగా లభించదు. నిరంతర కృషి, పట్టుదలతోనే అనుకున్నది సాధించగలరు. ఈ మాటలు సింగర్ నేహ కక్కర్ జీవితానికి సరిగ్గా సరిపోతాయి. ఆమె చిన్నప్పటి నుంచి, తన కుటుంబాన్ని పోషించడానికి పాటలు పాడుతోంది. ఆమె తండ్రి సమోసాలు అమ్మేవాడు. కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆమె భక్తి పాటలు పాడుతూ రోజుకు రూ.50 సంపాదించిన ఆమె, ఇప్పుడు ఆమె ఇండియాలో పాపులర్ సింగర్‌గా పేరొందింది. మరి ఆమె కెరీర్ లైఫ్ గురించి మీకు తెలుసా?
నేహా కక్కర్ బాల్యం:ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్‌లో 1988 జూన్ 6న నేహా కక్కర్ జన్మించింది. సింగర్ అవ్వాలనే ఆమె కోరికను నిజం చేయడానికి, కుటుంబం 1990ల ప్రారంభంలో దిల్లీకి మారింది. నేహా కక్కర్ కేవలం నాలుగు సంవత్సరాల వయస్సులో స్థానిక కార్యక్రమాలు, మతపరమైన సమావేశాల్లో, పెళ్లిల్లలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. 2004లో నేహా, ఆమె సోదరుడు టోనీ ముంబయికి వెళ్లారు. రెండు సంవత్సరాల తర్వాత, పద్దెనిమిదేళ్ల వయస్సులో ఆమె ఇండియన్ ఐడల్ రెండో సీజన్ ఆడిషన్స్‌కి హాజరైంది. కాంపిటీషన్ ప్రారంభంలోనే ఎలిమినేట్ అయింది.
వ్యక్తిగత జీవితం:నేహా కక్కర్, నటుడు హిమాన్ష్ కోహ్లీ 2014లో డేటింగ్ ప్రారంభించారు. 2018 సెప్టెంబర్‌లో వివాహం చేసుకోబోతున్నారని బహిరంగంగా ప్రకటించారు. అయితే, కేవలం మూడు నెలల తర్వాత ఇద్దరూ విడిపోయారు. కొంతకాలం తర్వాత, నేహా చండీగఢ్‌లో పంజాబీ సంగీత కళాకారుడు రోహన్‌ప్రీత్ సింగ్‌తో ప్రేమలో పడింది. వాళ్లు 2020 అక్టోబర్ 24న న్యూ దిల్లీలోని గురుద్వార వేడుకలో పెళ్లి చేసుకున్నారు. నేహా కక్కర్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ పాపులర్ సింగర్‌గా గుర్తింపు పొందింది.