తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

IMDB టాప్ రేటెడ్ సినిమాలు - ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయంటే ? - IMDB Top movies In OTT - IMDB TOP MOVIES IN OTT

IMDB Top Rated Movies : ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీలో ఉన్న టాప్ మూవీస్ ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయంటే?

IMDB Top Rated Movies
IMDB Top Rated Movies

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 2:23 PM IST

Updated : Apr 29, 2024, 2:58 PM IST

IMDB Top Rated Movies :ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీలో పలు ఇండియన్​ సినిమాలకు టాప్ రేటింగ్స్ ఇచ్చింది. అందులో తెలుగు సినిమా కూడా ఉంది. మరి ఆ సినిమాలు ఏవి. ఓటీటీలో వాటిని ఎక్కడ చూడచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

12th ఫెయిల్ : మనోజ్ కుమార్ శర్మ అనే ఐపీఎస్ జీవిత కథ ఆధారంగా తీశారు ఈ చిత్రం. ఇందులో మనోజ్ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో విక్రాంత్ మాసే పోషించారు. ఒక పేద కుటుంబానికి చెందిన అబ్బాయి 12వ తరగతి ఫెయిలైనా కూడా సరే పట్టుదలతో ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ఉద్యోగం తెచ్చుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ చిత్రానికి IMDB 9 పాయింట్ల రేటింగ్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్​ వేదికగా స్ట్రీమ్ అవుతోంది.

సీతారామం :మల్లు స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బీటౌన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం అటు కమర్షియల్ సక్సెస్​గానే కాకుండా క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న రామ్​ ఉత్తరాల ద్వారా పరిచయమైన సీతను ప్రేమిస్తాడు. ఆ తర్వాత వాళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు కానీ ఒక రహస్య మిషన్ మీద రామ పాకిస్థాన్ వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లిన రామ్​ కోసం సీత ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రేమ, దేశభక్తితో పాటు సెంటిమెంట్, మనసుకి నచ్చే పాటలు ఈ మూవీకి 8.5 రేటింగ్ ఇచ్చింది ఐఎండీబీ. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్​లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

హిడెన్ ఫిగర్స్ : 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. ముగ్గురు మహిళా ఆఫ్రికన్ అమెరికన్​ గణిత శాస్త్రజ్ఞుల చుట్టూ తిరుగుతుంది ఈ స్టోరీ. ఈ మూవీకి 7.8 IMDB రేటింగ్ ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్​లో ఈ సినిమాను చూడొచ్చు.

షాంగ్ చి : మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్​కు చెందిన మొట్టమొదటి ఆసియా సూపర్ హీరో షాంగ్ చి. ఈ చిత్రం కూడా కూడా బ్లాక్ పాంథర్ తరహాలో ఉంటుంది. ఇక ఈ మూవీకి సినిమాకి 7.4 IMDB రేటింగ్ వచ్చింది.

ఎం ఎస్ ధోని ఏ అన్​టోల్డ్​ స్టోరీ : స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ బయోగ్రఫీగా ఈ సినిమా తెరకెక్కింది. 2016లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుంది. ధోనిగా సుశాంత్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి IMDB 8 పాయింట్ల రేటింగ్ ఇచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్​లో ఈ సినిమా ప్రస్తుతం అందుబాటులో ఉంది.

బాహుబలి 2 : బాహుబలి చిత్రంతో దేశమే కాదు ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు దర్శకుడు రాజమౌళి. ప్రభాస్, అనుష్క, తమన్నా నటించిన ఈ మూవీకి 8.2 IMDB రేటింగ్ ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్​ వేదికగా ఈ సినిమా అందుబాటులో ఉంది.

చిచ్చోరే : 2019లో విడుదలైన ఈ సినిమా కూడా మూవీ లవర్స్​ను తెగ ఆకట్టుకుంది. సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ లీడ్​ రోల్​లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీకి 8.3 IMDB రేటింగ్ ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్​లో ఈ సినిమా చూడొచ్చు.

వీటి కోసమే ఆడియెన్స్ తెగ​ వెయిటింగ్​ - లిస్ట్​లో టాలీవుడ్​ మూవీ ఒక్కటే! - TOP 10 Upcoming Movies

పదికి తొమ్మిది పాయింట్లు- IMDB టాప్ మూవీలు/సీరియల్స్ ఇవే!

Last Updated : Apr 29, 2024, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details