Heroines Favourite Food: ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఎంత వయస్సు వచ్చినప్పటికీ యంగ్‌గానే కనిపిస్తారు. కొందరైతే 40ల్లో కూడా 20ఎళ్లలాగే కనిపిస్తారు. అయితే దీనికి ప్రధాన కారణం ఫిట్నెస్ మెయింటెన్ చేయడం. ఎక్సర్‌సైజ్‌తో పాటు వాళ్లు తీసుకునే ఫుడ్ కూడా ఒక కారణమే.
అయితే చాలామంది స్టార్ హీరోయిన్స్ ఫూడీస్ (ఫుడ్ లవర్స్). ఏది ఇష్టమైతే అది తినేయడమే అంటారు. అలా అని వాళ్ల డైలీ యాక్టివిటీలో తేడా రానివ్వరు. ఓ వైపు ఇష్టమైన ఫుడ్ తింటూనే, మరోవైపు దానికి తగ్గట్లు జిమ్‌లో కష్టపడుతుంటారు. అలా టాలీవుడ్, బాలీవుడ్‌తో సహా పలు ఇండస్ట్రీల హీరోయిన్లకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? తెలుసుకుందాం.
మృణాల్ ఠాకూర్: స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫుడ్ విషయానికొస్తే ఈ అందాల భామ నాన్‌వెజ్ లవర్ అంట. ఫిష్, వడపావ్ ఎంతో ఇష్టంగా తినేస్తుందట.
సమంత: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత వెజ్ ఎక్కువగా ఇష్టపడుతుంట. ఈ ముద్దుగుమ్మకు టమాటా రైస్ అంటే చాలా ఇష్టమట.
అనుపమ పరమేశ్వరన్:క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అందం, ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. అనుపమకు దాల్ రైస్, చికెన్ ఫేవరెట్ ఫడ్ అంట. అనుపమకు వాళ్ల అమ్మ వండిన ఫుడ్స్ ఎక్కువగా ఇష్టపడుతుదంట.
రష్మిక మందన్నా: నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో మంచి జోరుమీదుంది. ఈ అమ్మడికి డిజర్ట్స్, కొరియన్ ఫ్రైడ్ చికెన్ వడ్డిస్తే లొట్టలేసుకుంటూ తింటుందట.
తమన్నా భాటియా: మిల్కీ బ్యూటీ తమన్నాకు చేపల పులుసు, పెసరట్టు అంటే మహా ఇష్టమట. తమన్నా ఫేవరెట్ ఫుడ్ లిస్ట్‌లో చేపల పులుసు టాప్‌లో ఉంటుందట.