Heroine Tapsee Pannu Marriage :హీరోయిన్ తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఆమె చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉంది. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ లవ్ బర్డ్స్ వివాహబంధంతో ఒక్కటైనట్లు మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. మార్చి 20నే ప్రీవెడ్డింగ్ వేడుకలు ప్రారంభమైనట్లు ఆ కథనాల్లో రాసి ఉంది. 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ- మథియాస్ బోతో పెళ్లి జరిగిందని అంటున్నారు. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం అందుతోంది.
అలానే ఈ వార్తలకు బలం చేకూరేలా తాప్సీ బెస్ట్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ కనిక కూడా కొన్ని పిక్స్‌ను షేర్ చేసింది. నా స్నేహితుల పెళ్లిలో అంటూ రాసుకొచ్చింది. దీంతో కనిక ఈ పెళ్లికే వెళ్లిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఈ వేడుకకు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అందరూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం తాప్సీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.