Heroine Tabu Rejected Films:11 సంవత్సరాలకే బాలనటిగా హిందీలో 'బజార్' అనే సినిమాలో నటించింది టబు. ఆ తర్వాత 'హమ్ నవ్ జవాన్' అనే సినిమాలో దేవ్ ఆనంద్‌కు కూతురిగా నటించింది. 1991లో వెంకటేష్ హీరోగా నటించిన 'కూలీ నెం.1'తో హీరోయిన్గా తెరపై అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్నేళ్లు బిజీగా మారింది. అక్కడ కూడా సూపర్ హిట్ సినిమాలు చేసింది.
1994లో అజయ్ దేవగన్ హీరోగా చేసిన 'విజయ పథ్' సినిమాకు గాను బెస్ట్ డెబ్యూట్ నటి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత 'సాజన్ కి బాహో మెయిన్', 'జీత్' వంటి సినిమాలు చేసింది. మళ్లీ 1996లో తిరిగి టాలీవుడ్‌కి వచ్చి అక్కినేని నాగార్జున 'నిన్నే పెళ్ళాడతా'లో నటించింది. ఆ సినిమా టబుకి ఎంతో గుర్తింపుని ఇవ్వడమే కాదు ఉత్తమ హీరోయిన్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. అయితే అప్పట్లోనే ఈ భామ తీరిక లేకుండా షూటింగ్స్ వలనో, షెడ్యూల్ కుదరకపోవడం వలనో కొన్ని సూపర్ హిట్ సినిమాలను వదులుకుంది. మరి ఆ సినిమాలేంటంటే?
- 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాలో టీనా పాత్రకు మొదట టబునే అనుకున్నారట కాని టబు కాదనడం వల్ల ఆ పాత్ర రాణి ముఖర్జీని వరించింది.
- 'బదాయి హొ'లో పాత్రకు డైరెక్టర్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ టబుని అడిగారట కానీ టబునే ఆ పాత్రకు నీనా గుప్తాని రికమెండ్ చేశారట.
- 'మున్నా భాయి ఎంబిబిఎస్' సినిమాలో మొదట టబునే అనుకున్నారట అయితే టబు రిజెక్ట్ చేయడం వల్ల ఆ పాత్రకు గ్రేసీ సింగ్ ను తీసుకున్నారు.
- 'లజ్జా' సినిమాలో నటించడానికి అవకాశం వచ్చినా టబు కాదు అనడం వల్ల ఆ పాత్రలో మనీషా కోయిరాలా నటించింది.
- ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా 'మన్' లో కూడా టబు కాదనుకున్న పాత్ర మనీషా కోయిరాలా చేసింది.