తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పికిల్‌ బాల్‌ గేమ్‌ ఆడిన సమంత - ఈ ముద్దుగుమ్మ ఎనర్జీ, ఫిట్​నెస్​కు ఫ్యాన్స్ ఫిదా! - Samantha World Pickleball League - SAMANTHA WORLD PICKLEBALL LEAGUE

Samantha World Pickleball League : హీరోయిన్ సమంత పికిల్‌ బాల్‌ గేమ్‌ ఆడారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో సమంత ఫిట్ నెస్, ఎనర్జీ, జీరో సైజ్ అందం గురించి అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు.

source ETV Bharat and Associated Press
Samantha World Pickleball League (source ETV Bharat and Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 6:22 AM IST

Updated : Aug 28, 2024, 6:29 AM IST

Samantha World Pickleball League : స్టార్​ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్​లతో బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ మధ్యే మరో కొత్త ప్రయాణం కూడా ప్రారంభించారు. క్రీడలకు సంబంధించి వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టారు. కొద్ది రోజుల క్రితం వరల్డ్‌ పికిల్‌ బాల్‌ లీగ్‌లో చెన్నై ఫ్రాంఛైజీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సామ్​ తనలోని క్రీడాకారిణిని పరిచయం చేశారు. రాకెట్ చేతపట్టి పికిల్ బాల్ గేమ్​ ఆడారు. అక్కడి స్టేడియంలో పలువురు ఛాంపియన్లతో కలిసి ఆమె ఈ గేమ్‌ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియా ఇన్​స్టా గ్రామ్​ వేదికగా షేర్ చేసుకున్నారు. ఆట పూర్తైన తర్వాత డ్యాన్స్‌ రూపంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కాగా, ఆ మధ్య మయోసైటిస్‌కు గురైన సమంత దాదాపు ఏడాది పాటు నటనకు బ్రేక్ ఇచ్చారు. గతేడాది రిలైజన 'ఖుషి' తర్వాత మరో సినిమాలో నటించలేదు. అయితే అప్పటికే ఆమె బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌తో కలిసి సిటడెల్‌: హనీ బన్నీ (Citadel : Honey Bunny) అనే వెబ్ సిరీస్ చేశారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఆ వెబ్​ సిరీస్​ త్వరలోనే ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలానే సామ్​ 'మా ఇంటి బంగారం' అనే చిత్రాన్ని కూడా కొద్ది రోజుల క్రితం అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సమంత నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

ఏదేమైనా సమంత మరోసారి యాక్షన్ సీక్వెన్స్‌లకు రెడీగా, ఫిట్​గా ఉన్నట్టు తాజా వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇకపోతే సమంతకు ఓ బ్లాక్ బస్టర్ హిట్ పడి చాలా కాలం అయిపోయింది. ఫ్యామిలీ మెన్ 2 సీజన్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ఆమె ఖాతాలో పడలేదు. యశోద మూవీ పర్వాలేదనిపించింది. శాకుంతలం డిజాస్టర్​గా నిలిచింది. ఖుషి ఓ మోస్తరుగా మెప్పించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఆమె నటించిన కొత్త ప్రాజెక్ట్​లు ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటాయో.

శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ - నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మూవీ! - Sreeleela Upcoming Movies

సమంత వల్ల ట్రెండింగ్​లోకి వచ్చిన 'పికిల్ బాల్'​ - అసలేంటీ గేమ్, రూల్స్ ఎలా ఉంటాయి? - Samantha Pickleball Game

Last Updated : Aug 28, 2024, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details