Heroine Karishma Kapoor Divorce : సినీ రంగంలో డేటింగ్, మ్యారేజ్, డివొర్స్ వంటివి కామన్‌గానే వినిపిస్తుంటాయి. చాలా సార్లు వీటికి సంబంధించిన వార్తలను వింటుంటాం. అయితే డివొర్స్ తీసుకున్న ఓ హీరోయిన్ తాజాగా తన వైవాహిక జీవితం గురించి సంచలన విషయాలను తెలిపింది. తన మాజీ భర్త తనను ఏకంగా వేలం పెట్టాడని చెప్పుకొచ్చింది. హనీమూన్‌లో అతడి స్నేహితులతో కూడా కలిసి తాను సన్నిహితంగా గడపాలని బలవంతం చేసినట్లు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే బాలీవుడ్ స్టార్ కరీష్మా కపూర్. హిందీ ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరి కుటంబం నుంచి వచ్చిన హీరోయిన్ కరిష్మా కపూర్. ప్రేమ ఖైదీ అనే చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు పదేళ్ల పాటు జోరు చూపిస్తూ దూసుకెళ్లింది. పలు అవార్డులను కూడా అందుకుంది.
కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే హీరో అజయ్ దేవగణ్‌తో ప్రేమాయణం నడిపింది. కానీ ఇది వర్కౌట్ కాలేదు. అనంతరం అభిషేక్ బచ్చన్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ఇది కూడా సెట్ అవ్వలేదు. అనంతరం 2003లో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను కరీష్మా పెళ్లాడింది. ఇతడితో పెళ్లి జరిగాక కూడా కరీష్మా కెరీర్‌ను కొనసాగించింది. ఇద్దరు బిడ్డలకు కూడా జన్మనిచ్చింది. కానీ ఆ తర్వాత సంజయ్ కపూర్‌తో మనస్పర్థలు రావడంతో 2016లో విడాకులు ఇచ్చేసింది. అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనమే అయింది.