Hero Nani First Remuneration :నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన తన సహజ నటనతో పక్కింటి కుర్రాడిలా ఫ్యామిలీ అడియెన్స్, యూత్‌ను బాగా ఆకట్టుకున్నారు. తొలినాళ్లలో బాపు, కే.రాఘవేంద్రరావు లాంటి ప్రముఖ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఈ నేచురల్ స్టార్ ఆ తర్వాత డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దృష్టిని ఆకర్షించి అష్టా-చమ్మాతో హీరోగా మారిపోయారు.
తొలి సినిమాలోనే తనదైన శైలి నటనతో ఎంతో మంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టిన నాని ఆ తర్వాత సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోయారు. అలా ఎంతో మంది అభిమానుల ప్రేమ, అప్యాయతలను పొందారు. ఇక జెర్సీ సినిమా అయితే ఆయన కెరీర్లో ఎంతో ప్రత్యేకం. అందరి చేత కంటతడి పెట్టించారు. అప్పటివరకు లవ్ అండ్ సింపుల్ కథలతో ప్రేక్షకుల్ని మెప్పించిన నాని దసరాతో కాస్త రూట్ మార్చి యాక్షన్ బాట పట్టారు. ఆ సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.
దీంతో నాని మార్కెట్ మరింత పెరిగింది. ఇక రీసెంట్గా విడుదలైన హాయ్ నాన్న కూడా హిట్ టాక్‌తో మంచి వసూళ్లను అందుకుంది. ఇప్పుడు ఆయన ఒక్కో సినిమారు దాదాపు రూ.10 కోట్లు నుంచి రూ.20కోట్ల వరకు తీసుకుంటారని తెలిసింది. అయితే ఇన్ని కోట్లు తీసుకునే ఆయన తన తొలి రెమ్యునరేషన్‌గా రూ.2500 సంపాదించారట. అది కూడా చెక్ రూపంలో. కానీ అది తీసుకోగానే బౌన్స్ అయిందని చెప్పారు. మరి అది అసిస్టెంట్ డెరెక్టర్‌గా ఉన్నప్పుడు తీసుకున్నారో లేదా అష్టా చమ్మా సినిమాకు తీసుకున్నారో స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయాన్ని నానినే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.